Advertisement

  • ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ లో రెండో స్థానానికి పడిపోయిన టీమిండియా

ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ లో రెండో స్థానానికి పడిపోయిన టీమిండియా

By: Sankar Fri, 20 Nov 2020 08:47 AM

ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ లో రెండో స్థానానికి పడిపోయిన టీమిండియా


ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌ రేసులో ఇప్పటి వరకు భారత్‌ అగ్రస్థానంలో సాగింది. ఆడిన 9 మ్యాచ్‌లలో 7 గెలిచి 2 ఓడిన టీమిండియా... 360 పాయింట్లతో ముందంజలో నిలిచింది.

అయితే కరోనా కారణంగా పలు సిరీస్‌లు రద్దు కావడంతో టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కోసం పాయింట్ల విధానాన్ని మార్చాలని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) అధికారికంగా నిర్ణయించింది. ఆడిన మ్యాచ్‌ల సంఖ్య, అందుబాటులో ఉన్న మొత్తం పాయింట్ల సంఖ్యను చూస్తూ ఐసీసీ విజయ శాతాన్ని లెక్కించనుంది. దాంతో మొత్తం 480 పాయింట్ల (4 సిరీస్‌లు) ద్వారా 360 పాయింట్లు సాధించిన భారత్‌ విజయ శాతం 75 % గా ఉంది.

అదే ఆస్ట్రేలియా అందుబాటులో ఉన్న 360 పాయింట్ల (3 సిరీస్‌లు) 296 పాయింట్లు సాధించడంతో జట్టు విజయ శాతం 82.2%గా నిలిచింది. దాంతో తాజా ర్యాంకింగ్స్‌లో ఆసీస్‌ నంబర్‌వన్‌ కాగా, టీమిండియా రెండో స్థానానికి పడిపోయింది. 60.8 శాతంతో ఇంగ్లండ్‌ మూడో స్థానంలో కొనసాగుతోంది

Tags :

Advertisement