Advertisement

  • ఈ దశాబ్దపు అత్యుత్తమ టెస్ట్ జట్టుకు కెప్టెన్ గా కింగ్ కోహ్లీ

ఈ దశాబ్దపు అత్యుత్తమ టెస్ట్ జట్టుకు కెప్టెన్ గా కింగ్ కోహ్లీ

By: Sankar Sun, 27 Dec 2020 9:49 PM

ఈ దశాబ్దపు అత్యుత్తమ టెస్ట్ జట్టుకు కెప్టెన్ గా కింగ్ కోహ్లీ


2011 నుంచి 2020 అంటే ఒక దశాబ్దం ముగిసింది ...అయితే ఈ దశాబ్దంలో క్రికెట్ లో ఎన్నో అద్భుతాలు జరిగాయి ...సచిన్ , పాంటింగ్ , ద్రావిడ్ , సంగక్కర , కలిస్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఆటకు వీడుకోలు పలికితే కోహ్లీ , స్మిత్ , విలియమ్సన్ , రోహిత్ , వార్నర్ వంటివారు కొత్త జెనెరేషన్ ఆటగాళ్లుగా దూసుకొచ్చారు...అయితే ఈ దశాబ్దం పూర్తి అయినా సందర్భంగా ఐసీసీ ఈ దశాబ్దపు అత్యుత్తమ టెస్ట్ జట్టును ఎంపిక చేసింది..

అయితే ఈ దశాబ్దపు టెస్టు టీమ్‌కి కెప్టెన్‌గా కోహ్లీ ఎంపికయ్యాడు. భారత్ నుంచి కేవలం ఇద్దరు క్రికెటర్లకి మాత్రమే ఈ టీమ్‌లో చోటు దక్కగా.. కోహ్లీతో పాటు ఆఫ్ స్పిన్నర్ అశ్విన్‌‌కి ఛాన్స్ లభించింది. ఈ జట్టులో ఇప్పటికే క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లు కూడా ఉండటం విశేషం. పాకిస్థాన్‌ నుంచి కనీసం ఒక్క క్రికెటర్‌కి కూడా ఈ టీమ్‌లో చోటు లభించలేదు..

ఇక ఈ జట్టులో 2015 లోనే క్రికెట్ నుంచి రిటైర్ అయినా సంగక్కరకు కూడా చోటు లభించింది ..రిటైర్ అయ్యేవరకు కూడా అత్యుత్తమ ఫామ్లో ఉండటమే సంగక్కర ఈ జట్టులో సెలెక్ట్ అవడానికి కారణం ...ఇక ఇటీవల రిటైర్ అయినా స్టెయిన్ కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు

Tags :
|
|

Advertisement