Advertisement

  • హార్దిక్ శక్తి సామర్ధ్యాలు అమోఘం ...కెప్టెన్ కోహ్లీ

హార్దిక్ శక్తి సామర్ధ్యాలు అమోఘం ...కెప్టెన్ కోహ్లీ

By: Sankar Sun, 06 Dec 2020 8:43 PM

హార్దిక్ శక్తి సామర్ధ్యాలు అమోఘం ...కెప్టెన్ కోహ్లీ


ఆస్ట్రేలియా తో జరుగుతున్న టి ట్వంటీ సిరీస్ లో వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి టీం ఇండియా సిరీస్ కైవసం చేసుకుంది...ఈ రోజు జరిగిన రెండో మ్యాచ్ లో విజయం అనంతరం కోహ్లీ మాట్లాడుతూ టీ20 క్రికెట్‌లో ఒక జట్టుగా చాలా బాగా ఆడాం. మా జట్టులో గత మ్యాచ్‌లో ఆడిన ఇద్దరు ఆటగాళ్లు లేరు(షమీ, జడేజాలను ఉద్దేశించి) కీలక ఆటగాళ్లైన ఆ ఇద్దరూ లేకుండానే గెలిచాం.

ఇంతకంటే ఏం కావాలి. ఈ ప్రదర్శన నాకు చాలా గర్వంగా ఉంది. ప్రతీ ఒక్కరికి ఐపీఎల్‌ ఆడిన అనుభవం ఉంది. వారికి వారి వ్యూహాలు ఏమిటో తెలుసు. ముఖ్యంగా హార్దిక్‌, శ్రేయస్‌లు 14 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడారు. దాంతో వారు వ్యూహ రచన సరైన దిశలో సాగింది. నటరాజన్‌ ప్రదర్శన అసాధారణం. శార్దూల్‌ కూడా బాగా బౌలింగ్‌ చేశాడు. శిఖర్‌ హాఫ్‌ సెంచరీ చేసి మంచి ఆరంభాన్ని ఇస్తే, హార్దిక్‌ మంచి ఫినిషింగ్‌ ఇచ్చాడు..

ఇది కచ్చితంగా సమష్టి విజయం. హార్దిక్‌ శక్తి సామర్థ్యాలు అమోఘం. 2016లో మా జట్టులోకి రావడానికి హార్దిక్‌లోని అపరమైన సామర్థ్యం కల్గి ఉండటమే. ఇటీవల కాలంలో హార్దిక్‌ మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. ఫినిషర్‌గా ఇదే సరైన సమయమని హార్దిక్‌ గుర్తించాడు. అతని స్కిల్స్‌తో హార్దిక్‌ ఎక్కడో ఉన్నాడు. ఆఖరి టీ20 మ్యాచ్‌కు ఆసక్తికరంగానే ఉంటుంది.

మా అండగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు. నేను ఫైన్‌లెగ్ పైనుంచి స్కూప్‌ షాట్‌ ఆడటం చాలా సరదాగా అనిపించింది. అది నాకే ఆశ్చర్యం కల్గించింది. ఈ విషయాన్ని ఏబీ డివిలియర్స్‌కు మెసెజ్‌ చేస్తా. దాని గురించి ఏబీ ఏమి అనుకుంటున్నాడో తెలుసుకుంటా’ అని కోహ్లి తెలిపాడు

Tags :

Advertisement