Advertisement

  • రేవంత్ రెడ్డి నీ కలిసిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే...!

రేవంత్ రెడ్డి నీ కలిసిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే...!

By: Anji Sun, 27 Dec 2020 3:55 PM

రేవంత్ రెడ్డి నీ కలిసిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే...!

తెలంగాణలో ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ పదవి హాట్ టాపిక్‌గా మారింది. ఈ పోస్టు రేసులో రేవంత్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. టీపీసీసీ చీఫ్ పదవికి ఎంపీ రేవంత్ రెడ్డి సరైన వ్యక్తి అనే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్లు సమచాారం.

దీంతో పలువురు సీనియర్లు దీనిని వ్యతిరేకిస్తున్నారు. పీసీసీ చీఫ్ నియామకంలో తొందర వద్దని వారిస్తున్నారు. అయితే ఈ సమయంలో పలువురు నాయకులు ముందుగానే రేవంత్‌ను కలిసి అడ్వాన్స్‌గా అభినందనలు తెలుపుతున్నారు.

ఈ నేపథ్యంలో ఎంపీ రేవంత్ రెడ్డిని కలిశారు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. మల్కాజ్‌గిరిలోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన కుమార్తె వివాహానికి రావాల్సిందిగా చింతమనేని ఆహ్వానించారు.

వివాహ శుభలేఖను రేవంత్‌ రెడ్డికి అందజేశారు. ప్రస్తుతం చింతమనేని హైదరాబాద్‌లో ఉన్నారు.తన అనుచరులు, పార్టీ నేతలతో కలిసి మల్కాజ్‌గిరిలోని రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు.

అనంతరం ఆయనకు వివాహ శుభలేఖను అందజేశారు. పీసీసీ అధ్యక్ష పదవి రేసులో ముందున్న రేవంత్ రెడ్డిని ఈ సందర్భంగా చింతమనేని అభినందించినట్లు చెబుతున్నారు.

Tags :

Advertisement