Advertisement

  • జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఒక్క స్థానం కూడా గెలవని తెలుగుదేశం పార్టీ

జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఒక్క స్థానం కూడా గెలవని తెలుగుదేశం పార్టీ

By: Sankar Fri, 04 Dec 2020 8:46 PM

జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఒక్క స్థానం కూడా గెలవని తెలుగుదేశం పార్టీ


గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. 150 స్థానాలకు గానూ ఈ సారి 106 డివిజన్లలో పోటీ చేయగా ఒక్కటి కూడా గెలవలేదు.

ఏ డివిజన్‌లోనూ డిపాజిట్‌ కూడా దక్కించుకోలేకపోయింది. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో భాగంగా 82 స్థానాల్లో పోటీ చేసి కేవలం ఒక వార్డు మాత్రమే గెలుచుకుంది. ఈ సారి ఆ ఒక్క వార్డు కూడా గెలుచుకోలేకపోవటం గమనార్హం..

కాగా, గతంలో టీడీపీతో పొత్తులో భాగంగా 68 స్థానాల్లో బరిలోకి దిగిన బీజేపీ 4 స్థానాలు గెలిచింది. ఈ సారి 150 స్థానాల్లో పోటీ చేసి 49 డివిజన్లను కైవసం చేసుకుంది. ఇక టీఆర్‌ఎస్‌ 56, ఎమ్‌ఐఎమ్ 43‌ స్థానాలు సొంతం చేసుకున్నాయి.

Tags :
|
|
|

Advertisement