Advertisement

  • ఎల్ అండ్ టీ తో పోటీ పడి ప్రతిష్ఠాత్మక కాంట్రాక్టును కైవసం చేసుకున్న టాటా సంస్థ

ఎల్ అండ్ టీ తో పోటీ పడి ప్రతిష్ఠాత్మక కాంట్రాక్టును కైవసం చేసుకున్న టాటా సంస్థ

By: chandrasekar Thu, 17 Sept 2020 12:26 PM

ఎల్ అండ్ టీ తో పోటీ పడి ప్రతిష్ఠాత్మక కాంట్రాక్టును కైవసం చేసుకున్న టాటా సంస్థ


పార్లమెంట్ నూతన భవన నిర్మాణ ప్రాజెక్టు కాంట్రాక్టును ప్రముఖ దేశీయ కంపెనీ టాటా సంస్థ దక్కించుకుంది. టాటా సంస్థ ఎల్ అండ్ టీ తో పోటీ పడి ఈ కాంట్రాక్టును దక్కించుకుంది . భారత స్వాతంత్య్ర కాలం నుంచి ఉన్న పార్లమెంట్ భవనం రానున్న కొద్దికాలంలో ఇతర అవసరాలకు ఉపయాగించనున్నారు. పార్లమెంట్ హౌస్ ఎస్టేట్ లో నూతన భవనం త్వరలో నిర్మితం కానుంది. దీనికి సంబంధించిన ఆర్దిక బిడ్స్ ఖరారయ్యాయి. ఎల్ ఎండ్ టీ సంస్థతో పోటీ పడి ప్రముఖ దేశీయ దిగ్గజమైన టాటా సంస్థ ఈ ప్రతిష్టాత్మక నిర్మాణ ప్రాజెక్టు కాంట్రాక్టును చేజిక్కించుకుంది. నూతన భవన నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రజా పనుల శాఖ 940 కోట్లుగా అంచనా వేసి నిర్వహించిన వేలంపాట లో టాటా సంస్థ..861.90 కోట్లకు బిడ్ ను కైవసం చేసుకుంది. అటు ఎల్ అండ్ టీ ఈ నిర్మాణానికి 865 కోట్లుగా బిడ్ దాఖలు చేసింది. టాటా సంస్థ అంతకంటే తక్కువకు బిడ్ వేయడంతో కాంట్రాక్టు టాటా సంస్థకు దక్కింది.

పార్లమెంట్‌ హౌస్‌ ఎస్టేట్‌లోని 118వ నెంబర్‌ ప్లాట్‌లో 60 వేల చదరపు మీటర్ల భారీ విస్తీర్ణంలో నూతన భవనం నిర్మితం కానుంది. సెంట్రల్‌ విస్టా రీ డెవలప్‌మెంట్ ‌లో భాగంగా తొలి ప్రాజెక్టుగా పార్లమెంట్‌ నూతన భవన నిర్మాణాన్ని చేపట్టనున్నారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌తో పాటు రెండు అంతస్తులతో త్రిభుజాకార భవనంగా దీన్ని నిర్మాణం చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన డిజైన్ కూడా కంఫర్మ్ అయ్యింది. బ్రిటిష్‌ కాలంలో నిర్మించిన ప్రస్తుత భవనానికి మరమ్మత్తులు చేసి ఇతర అవసరాల కోసం వినియోగించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పార్లమెంట్‌ నూతన భవన నిర్మాణానికి సంబంధించి ఈ ఏడాది ఆరంభంలోనే కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ప్రస్తుత పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగిసిన తర్వాత నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్టు సమాచారం. ఏడాది కాలంలో భవన నిర్మాణం పూర్తిచేయనున్నారు. నూతన పార్లమెంట్‌ భవనంపై భారత జాతీయ చిహ్నం ముద్రించనున్నారు.

Tags :

Advertisement