Advertisement

ఎయిర్ ఇండియా కొనుగోలుకు టాటా గ్రూప్ యత్నం...

By: chandrasekar Mon, 14 Dec 2020 11:15 PM

ఎయిర్ ఇండియా కొనుగోలుకు టాటా గ్రూప్ యత్నం...


ప్రభుత్వరంగ ఎయిర్ ఇండియా ను కొనుగోలు చేయుటకు టాటాసన్స్ ఈరోజు బిడ్లు దాఖలు చేసింది. ఎయిర్ ఇండియా నిర్ధేశించిన బిడ్ కోసం ఈ రోజు గడువు ముగియనుండటంతో టాటాసన్స్ చివరి రోజున బిడ్ దాఖలు చేసింది.

ప్రస్తుతం టాటాసన్స్ సమర్పించిన బిడ్లో అర్హత సాధించినట్లు అయితే రానున్న 15 రోజుల్లో ఫైనాన్షియల్ బిడ్ను సమర్పించుటకు అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడున్న ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ మొట్టమొదటిగా టాటా ఎయిర్ లైన్స్ పేరిట స్థాపించబడింది. ఆ తర్వాత అది ప్రభుత్వ కైవసం కావడంతో దానికి ఎయిర్ ఇండియాగా పేరు మార్చబడింది.

ప్రస్తుతం టాటా గ్రూపు విస్తారా ఎయిర్లైన్స్ ను మరియు ఎయిర్ ఏసియా ఎయిర్లైన్స్ ను భాగస్వామ్యంతో నడుపుతుంది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా లోని ఉద్యోగుల గ్రూపు 51 శాతం వాటాను కొనుగోలు చేయుటకు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఎయిర్ ఇండియాను కొనుగోలు చేయుటకు టాటాసన్స్ బిడ్ సమర్పించడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Tags :
|
|
|

Advertisement