Advertisement

మాస్టర్‌కి వందకోట్ల ఆఫర్‌!

By: Dimple Sat, 29 Aug 2020 02:26 AM

మాస్టర్‌కి వందకోట్ల ఆఫర్‌!

తమిళ హీరో విజయ్‌ హీరోగా నటించిన 64వ చిత్రం ‘మాస్టర్‌’. ఈ చిత్రం షూటింగ్‌, రీరికార్డింగ్‌, డబ్బింగ్‌ పూర్తయి తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్‌ తొమ్మిదిన ఈ చిత్రం విడుదల కావాల్సి వుండగా లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్లు మూతపడటంతో రిలీజ్‌ కాలేక పోయింది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ ముగిసిన వెంటనే థియేటర్లలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత జేవియర్‌ బిరిటో ప్రకటించారు.

అయితే ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సహా అన్ని ఓటీటీ సంస్థలు ‘మాస్టర్‌’ చిత్రాన్ని కొనేందుకు పోటీపడుతున్నాయి. గత రెండు రోజులుగా ఈ చిత్రాన్ని కొనేందుకు ఓటీటీ సంస్థలు రూ.70 కోట్ల నుంచి రూ.100 కోట్ల దాకా ఆఫర్లు ప్రకటించాయి.

ఈ బంపర్‌ ఆఫర్‌కు ‘మాస్టర్‌’ చిత్రనిర్మాణ సంస్థ అంగీకరిస్తుందని కోలీవుడ్‌ అంతటా పుకార్లు బయల్దేరాయి. ఈ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేస్తామని నిర్మాత పదే పదే చెబుతున్నప్పటికీ, ఓటీటీ సంస్థలు చిత్రం కొనుగోలుకు విపరీతంగా పోటీపడుతున్నాయి. ఈ పోటీ కారణంగా ఈ చిత్రం రేటు వందకోట్లు దాటే అవకాశం కూడా ఉందని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

Tags :
|

Advertisement