Advertisement

  • తమిళనాడులో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు

తమిళనాడులో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు

By: Sankar Mon, 29 June 2020 7:28 PM

తమిళనాడులో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు



తమిళనాడు రాజధాని నగరం చెన్నైలో మళ్లీ లాక్‌డౌన్ విధించినప్పటికీ ఆ రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసులు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఇవాళ కూడా తమిళనాడులో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. కరోనా కేసుల్లో మహారాష్ట్రను తలపించేలా తమిళనాడులో ఇవాళ ఒక్కరోజే 3949 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తమిళనాడులో 85వేలు దాటింది.

ప్రస్తుతం తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 86,224కు చేరింది. మరణాల సంఖ్య కూడా తమిళ రాష్ట్రాన్ని కలవరపెడుతోంది. ఇవాళ ఒక్కరోజే తమిళనాడులో కరోనా సోకిన వారిలో 62 మంది మరణించినట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో.. మరణాల సంఖ్య 1141కి చేరింది.

తమిళనాడులో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 37,331 కాగా.. ఇప్పటివరకూ ఆ రాష్ట్రంలో 47,749 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. రికవరీ రేటు మెరుగ్గా ఉండటం కాస్త ఊరట కలిగించే విషయం. అయితే.. తమిళనాడులో ఈ స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో సీఎం పళనిస్వామి వైద్య నిపుణులతో తాజా పరిస్థితులపై చర్చించారు. రాష్ట్రం మొత్తం లాక్‌డౌన్ విధించాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు తేల్చి చెప్పడం గమనార్హం.

Tags :
|
|
|

Advertisement