Advertisement

  • తమిళనాట సంచలనం సృష్టించిన తండ్రి కొడుకుల పోలీస్ కస్టడీ మృతి కేసు ప్రధాన నిందితుడు కరోనా తో మృతి

తమిళనాట సంచలనం సృష్టించిన తండ్రి కొడుకుల పోలీస్ కస్టడీ మృతి కేసు ప్రధాన నిందితుడు కరోనా తో మృతి

By: Sankar Mon, 10 Aug 2020 2:51 PM

తమిళనాట సంచలనం సృష్టించిన తండ్రి కొడుకుల పోలీస్ కస్టడీ మృతి కేసు ప్రధాన నిందితుడు కరోనా తో మృతి



తమిళనాడు తో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తండ్రి కొడుకుల పోలీస్ కస్టడీ హత్యా కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రత్యేక పోలీస్‌ ఇన్స్‌పెక్టర్‌ పౌల్దురై కరోనా సోకి సోమవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పౌల్దురైకు జూలై 24న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. అప్పుడు అతను మదురై సెంట్రల్ జైల్‌లో ఉన్నాడు. అదే రోజు అతడిని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పౌల్దురైకు ప్రత్యేక వైద్యం అందించాలని అతడి భార్య శనివారం మదురై పోలీస్ కమిషనర్‌ను కోరగా.. అతడిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)కు తరలించారు. సోమవారం చికిత్సపొందుతూ అక్కడ మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా జూన్ 19న పి.జయరాజ్, అతడి కుమారుడు జె.బెన్నిక్స్ తమ మొబైల్ దుకాణాన్ని సకాలంలో మూసివేయలేదని కేసు నమోదు చేసి వారిని జ్యుడీషియల్ కస్టడీకి తీసుకెళ్లి జూన్ 21న కోవిల్‌పట్టి జైలులో ఉంచారు. పోలీసుల హింసించడంతో జూన్ 22న రాత్రి జయరాస్‌, జూన్ 23 ఉదయం బెన్నిక్స్ కస్టడీలోనే మరణించారు. ఈఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా తండ్రీకొడుకుల మృతికి కారణమైన పోలీసులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్‌ చేయడంతో కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కు బదిలీ చేశారు.

ఈ కేసులో 10 మంది పోలీసులను సీబీఐ అదుపులోకి తీసుకోగా వారిలో పాల్దురై కూడా ఉన్నారు. ఆయన ప్రధాన పాత్రధారిగా ఆరోపణలు రావడంతో అరెస్టు చేసి మదురై సెంట్రల్‌ జైలుకు తరలించారు. అక్కడ ఆయన అనారోగ్యం బారిన పడడంతో పరీక్ష చేయగా కరోనా పాజిటివ్‌గా తేలింది.

Tags :
|
|

Advertisement