Advertisement

  • తమిళ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ పై స్పందించిన విజయ్ టీం

తమిళ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ పై స్పందించిన విజయ్ టీం

By: Sankar Thu, 05 Nov 2020 7:48 PM

తమిళ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ పై స్పందించిన విజయ్ టీం


విజయ్‌ పొలిటికల్‌ ఎంట్రీపై జరుగుతున్న ప్రచారంపై అతడి పీఆర్‌ఓ టీం తాజాగా ట్విటర్‌ వేదికగా స్పందించింది. ఈ వార్తలన్నీ అవాస్తమని స్పష్టం చేసింది.

ఈ మేరకు... ‘‘ బ్రేకింగ్‌: దళపతి విజయ్‌ ఎలక్షన్‌ కమిషన్‌ వద్ద తన రాజకీయపార్టీని రిజిస్టర్‌ చేయించారంటూ ప్రచారమవుతున్న వార్తలు నిజం కాదు’’ అంటూ విజయ్‌ పీఆర్‌ఓ రియాజ్‌ అహ్మద్‌ ట్వీట్‌ చేశాడు. కాగా విజయ్‌ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖరన్‌ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆలిండియా దళపతి విజయ్‌ మక్కల్‌ ఇయాక్కం’’పేరిట పొలిటికల్‌ పార్టీని రిజిస్టర్‌ చేయించేందుకు దరఖాస్తు చేశాను.

ఇది నాకు నేనుగా తీసుకున్న నిర్ణయం. ఇది విజయ్‌ పొలిటికల్‌ పార్టీ కానేకాదు. తను రాజకీయాల్లోకి వస్తాడో రాడో అన్న విషయం గురించి నేనేం చెప్పలేను’’ అని వ్యాఖ్యానించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ మేరకు వార్తలు వెలువడినట్లు తెలుస్తోంది.

Tags :

Advertisement