Advertisement

  • నివర్ తుపానును ఎదుర్కొనేందుకు సిద్దమైన తమిళనాడు ప్రభుత్వం

నివర్ తుపానును ఎదుర్కొనేందుకు సిద్దమైన తమిళనాడు ప్రభుత్వం

By: Sankar Tue, 24 Nov 2020 8:06 PM

నివర్ తుపానును ఎదుర్కొనేందుకు సిద్దమైన తమిళనాడు ప్రభుత్వం


దూసుకొస్తున్న నివర్ తుపానును ఎదుర్కొనేందుకు తమిళనాడు ప్రభుత్వం సిద్ధమైంది. రేపు తమిళనాడులోని ప్రభుత్వ కార్యాలయాలు, స్కూల్స్ సహా అన్నింటినీ బంద్ చేయాలని సీఎం పళనిస్వామి ఆదేశాలుజారీ చేశారు.

అత్యవసర సేవల ఉద్యోగులు మాత్రమే విధుల్లో ఉండాలని సూచించారు. ఇప్పటికే చెన్నై సిటీలో వాతావరణం మబ్బేసింది. కరైకల్, నాగపట్నం, చెన్నైలో పలుచోట్ల సన్నని జల్లులు కురుస్తున్నాయి. దీంతో జనంలో భయాందోళనలు కనిపిస్తున్నాయి.

కడలూరు, మహాబలిపురం, పెరబలూరులో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ వర్షం కూడా మొదలయింది. పుదుచ్చేరిలో తుపాను గురిన్కిహ్ 144 సెక్షన్ విధించ్ఝారు. కడలూర్ పోర్టులో 7వ నంబర్ హెచ్చరిక జారీ చేసి చెన్నై పోర్టులో 6వ నంబర్ హెచ్చరిక జారీ చేశారు. చెన్నైలో 100 కి.మీ. వేగంతో గాలులు వీచే సూచనలు కనిపిస్తున్నాయి. తమిళనాడు వ్యాప్తంగా 24 ట్రైన్ లు రద్దు చేసింది రైల్వేశాఖ.. రేపు తమిళనాడు వ్యాప్తంగా సెలవు ప్రకటించారు.

Tags :
|
|

Advertisement