Advertisement

  • రాజమల మృతులకు 3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన తమిళనాడు సీఎం పళనిస్వామి

రాజమల మృతులకు 3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన తమిళనాడు సీఎం పళనిస్వామి

By: chandrasekar Thu, 20 Aug 2020 1:38 PM

రాజమల మృతులకు 3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన తమిళనాడు సీఎం పళనిస్వామి


కేర‌ళ ఇడుక్కి జిల్లాలోని రాజ‌మ‌ల‌లో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌డంతో 62 మంది ప్రాణాలు పోయాయి. రాజ‌మ‌ల మృతుల కుటుంబాల‌కు రూ. 3 ల‌క్ష‌ల చొప్పున న‌ష్ట‌ప‌రిహారం ఇస్తున్న‌ట్లు త‌మిళ‌నాడు సీఎం ప‌ళ‌నిస్వామి ప్ర‌క‌టించారు.

తీవ్రంగా గాయ‌ప‌డి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న బాధితుల‌కు రూ. ల‌క్ష చొప్పున ప‌రిహారం ప్ర‌క‌టించారు. ఆగ‌స్టు 7వ తేదీన రాజ‌మ‌ల‌లో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌గా.. మంగ‌ళ‌వారం వ‌ర‌కు స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగాయి. అక్క‌డ మృత‌దేహాలు ల‌భ్యం కావ‌డం లేద‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు.

ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ మృతుల కుటుంబాల‌కు రూ. 5 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించ‌గా, ప్ర‌ధాని మోదీ రూ. 2 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించారు. మృతుల కుటుంబాల‌ను ఆదుకుంటామ‌ని, వారికి పున‌రావాసం క‌ల్పిస్తామ‌ని సీఎం విజ‌య‌న్ స్ప‌ష్టం చేశారు.

Tags :

Advertisement