Advertisement

  • తెలంగాణకు పది కోట్ల ఆర్థిక సాయం ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం

తెలంగాణకు పది కోట్ల ఆర్థిక సాయం ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం

By: Sankar Mon, 19 Oct 2020 5:34 PM

తెలంగాణకు పది కోట్ల ఆర్థిక సాయం ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం


భారీ వర్షాలకు తెలంగాణ మొత్తం తడిసి ముద్దవుతున్న విషయం తెలిసిందే..వాగులు , వంకలు పొంగి పొర్లుతున్నాయి..ముఖ్యంగా హైదరాబాద్ ఈ వర్షాలకు అతలాకుతలం అయింది..అనేక మంది ప్రాణ నష్టం , ఆస్థి నష్టం జరిగింది..అనేక ఇల్లు వరదల్లో మునిగిపోయాయి... ఇప్పటికే నగరంలో వందకు పైగా కాలనీలు.. వరదలోనే ఉన్నాయి. మరోసారి వర్షం కురుస్తుండటంతో... ఇంకెన్నీ కాలనీలకు వరద విస్తరిస్తోందని జనం భయపడిపోతున్నారు.

అయితే ఇప్పటికే భారీ వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఎన్నో కష్ట నష్టాలకు గురయ్యారని, వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని చంద్రశేఖర్ రావు ప్రకటించారు.. వరదనీటి ప్రభావానికి గురైన హైదరాబాద్ నగరంలోని ప్రతీ ఇంటికి రూ. 10 వేల చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తామని ప్రకటించారు. ఈ ఆర్ధిక సాయం మంగళవారం ఉదయం నుంచే ప్రారంభిస్తామని వెల్లడించారు. వర్షాలు, వరదల వల్ల ఇల్లు పూర్తిగా కూలిపోయిన వారికి లక్ష రూపాయల చొప్పున, పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు రూ. 50 వేల చొప్పున ఆర్ధిక సాయం అందించనున్నట్లు సీఎం ప్రకటించారు.

ఇక ఈ క్రమంలో నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ఇచ్చిన పిలుపు మేరకు మేఘా ఇంజనీరింగ్, అండ్ ఇన్ఫ్రా సంస్థ (MEIL) వెంటనే స్పందించింది. సీఎం సహాయనిధికి (CMRF) పది కోట్ల రూపాయల విరాళం ప్రకటించింది. తాజాగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణకు పది కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు..

Tags :

Advertisement