Advertisement

  • ఆన్‌లైన్ టాలెంట్ ప్రదర్శన వేదిక అయిన 'టాలెంటెర్జ్'

ఆన్‌లైన్ టాలెంట్ ప్రదర్శన వేదిక అయిన 'టాలెంటెర్జ్'

By: chandrasekar Mon, 06 July 2020 5:57 PM

ఆన్‌లైన్ టాలెంట్ ప్రదర్శన వేదిక అయిన 'టాలెంటెర్జ్'


ఆన్‌లైన్ టాలెంట్ ప్రదర్శన వేదిక అయిన 'టాలెంటెర్జ్' ఆన్‌లైన్ టాలెంట్ హంట్‌ను నిర్వహిస్తోంది. ఈ పోటీలో 2.5 ఏండ్ల వయసు నుంచి 18 ఏండ్ల మధ్య వయస్సు గలవారు పాల్గొనవచ్చు. ఇందులో పాల్గొనేవారు తమ శక్తి, సృజనాత్మకతను బయటపెట్టాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌లో ఉండటం వల్ల దేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన పిల్లలు కూడా పాల్గొనేందుకు అవకాశం చిక్కింది.

గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోని వారిలో దాగిఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఇది ఒక చక్కటి వేదికగా నిలువనున్నది. సృజనాత్మకత, శక్తి ఉన్నవారికి మాత్రమే ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులు అని టాలెంటెర్జ్‌ వ్యవస్థాపకుడు రమ్య గంగాధరన్ చెప్పారు. ఈ పోటీల్లో పాల్గొనేవారు వారి రెండు నిమిషాల వీడియోలు లేదా ఫొటోలను అప్‌లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది.

ఎంట్రీలను గౌరీ పాలచంద్రన్, డైరెక్టర్- ఔట్రీచ్ ప్రోగ్రామ్స్, కథ, సీ సురేష్ కుమార్, థియేటర్ మరియు ఫిల్మ్, మిసెస్ ఇండియా ఇంటర్నేషనల్ గ్లోబల్ 2018 శైలీ ధగత్ జడ్జీలుగా పాల్గొంటారు. ఆసక్తిగల వారు www.talenterz.com లో లాగిన్ అవ్వడం ద్వారా పేర్లను నమోదు చేసుకోవచ్చు.

Tags :
|
|

Advertisement