Advertisement

  • దాదాపు 250 రోజుల తర్వాత ఆ దేశంలో కరోనా పాజిటివ్ కేసు నమోదు

దాదాపు 250 రోజుల తర్వాత ఆ దేశంలో కరోనా పాజిటివ్ కేసు నమోదు

By: Sankar Tue, 22 Dec 2020 4:29 PM

దాదాపు 250  రోజుల తర్వాత ఆ దేశంలో కరోనా పాజిటివ్ కేసు నమోదు


ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు కరోనా మహమ్మారి దెబ్బకు కుదేలు అయితే కొన్ని దేశాలు మాత్రం మహమ్మారిని సమర్థవంతంగా అడ్డుకున్నాయి..ఆలా కరోనా కు సమర్థవంతంగా ఎదుర్కొన్న దేశాలలో తైవాన్ ఒకటి..మొద‌ట్లోనే క‌రోనాను అడ్డుకునేందుకు ఈ దేశం తీసుకున్న చ‌ర్య‌లతో ఈ మ‌హ‌మ్మారి చాలా వ‌ర‌కు నియంత్ర‌ణ‌లోకి వ‌చ్చింది.

250 రోజుల పాటు అక్క‌డ స్థానికంగా ఒక్క కేసు కూడా న‌మోదు కాలేదు. విదేశాల నుంచి వ‌చ్చిన వాళ్ల‌లోనే కొన్ని కేసులు వ‌చ్చాయి. అయితే తాజాగా ఏప్రిల్ 12 త‌ర్వాత మ‌ళ్లీ మంగ‌ళ‌వారం స్థానికంగా సంక్ర‌మించిన‌ ఒక కేసు నమోదైంది. న్యూజిలాండ్‌కు చెందిన పైల‌ట్ స్నేహితురాలికి వైర‌స్ సోకిన‌ట్లు గుర్తించారు.

దీంతో ఆమెతో స‌న్నిహితంగా ఉన్న మ‌రో 100 మందికి టెస్టులు నిర్వ‌హిస్తున్నారు. ఆదివారం స‌ద‌రు న్యూజిలాండ్ పైల‌ట్‌కు కూడా వైర‌స్ సోకిన‌ట్లు గుర్తించారు. అత‌నితో స‌న్నిహితంగా ఉన్న కార‌ణంగా 30 ఏళ్ల ఈ మ‌హిళ‌కు కూడా వైర‌స్ సోకిన‌ట్లు తైవాన్ ఆరోగ్య శాఖ మంత్రి చెన్ షిహ్‌-చుంగ్ వెల్ల‌డించారు. స‌ద‌రు పైల‌ట్ తైవాన్‌లో తిరిగిని అన్న ప్ర‌దేశాల‌లో ఇప్పుడు అక్క‌డి ప్ర‌భుత్వం హైఅల‌ర్ట్ ప్ర‌క‌టించింది.

Tags :
|

Advertisement