Advertisement

టీ20 వరల్డ్ కప్ వాయిదా

By: chandrasekar Tue, 21 July 2020 5:18 PM

టీ20 వరల్డ్ కప్ వాయిదా


కరోనా మహమ్మారి ఎఫెక్ట్‌తో టీ20 వరల్డ్ కప్ వాయిదా పడింది. ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా నిర్వహించనున్న టీ20 ప్రపంచ కప్‌ను వాయిదా వేస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) సోమవారం (జులై 20) ప్రకటించింది. వచ్చే ఏడాది అక్టోబర్‌‌లో దీన్ని నిర్వహించనున్నట్లు తెలిపింది.

కానీ.. ఇదే సమయంలో క్రికెట్ అభిమానులకు ఐసీసీ గుడ్ న్యూస్ అందించింది. వరసగా మూడేళ్లలో మూడు మెగా టోర్నీలు నిర్వహించనున్నట్లు తెలిపింది. 2023లో క్రికెట్ ప్రపంచకప్ భారత్‌లో జరుగనుంది.

ఈ ఏడాది అక్టోబర్‌ 18 నుంచి నవంబర్‌ 15 వరకు టీ20 ప్రపంచకప్ నిర్వహించాలని ఇంతకుముందు షెడ్యూల్ విడుదల చేశారు. ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న పరిస్థితుల్లో క్రికెట్ నిర్వహించే పరిస్థితి లేదని భావించిన ఐసీసీ దీన్ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. సోమవారం జరిగిన సమావేశంలో ఐసీసీ కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే మూడేళ్లలో (2021-23 మధ్య) వరుసగా మూడేళ్లు మెగా టోర్నీలు నిర్వహించాలని నిర్ణయించారు.

ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌ 2021 వచ్చే ఏడాది అక్టోబర్‌ మధ్య జరుగనుండగా నవంబర్‌ 14న ఫైనల్‌ మ్యాచ్‌ నిర్వహించనున్నారు. ఇక 2022లోనూ అక్టోబర్‌-నవంబర్‌లో మధ్య ఐసీసీ టీ20 టోర్నీ నిర్వహించనున్నారు. ఫైనల్‌ మ్యాచ్‌ను నవంబర్ 13న నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

Tags :
|
|

Advertisement