Advertisement

  • కరోనా వాక్సిన్ తీసుకున్న నలుగురికి ముఖ పక్షవాతం లక్షణాలు

కరోనా వాక్సిన్ తీసుకున్న నలుగురికి ముఖ పక్షవాతం లక్షణాలు

By: chandrasekar Sat, 12 Dec 2020 11:09 AM

కరోనా వాక్సిన్ తీసుకున్న నలుగురికి ముఖ పక్షవాతం లక్షణాలు


కరోనా వైరస్ ఒక రకంగా ప్రజలను ఇబ్బడిని పెడుతుంటే దానిని అరికట్టడానికి తయారు చేసిన వాక్సిన్ వల్ల కొత్త దుష్ప్రభావాలు ఏర్పడుతున్నాయి. చాలా కంపెనీలు ప్రస్తుతం తయారు చేసిన వాక్సిన్ ను వివిధ దశల క్లినికల్ ట్రయిల్ లో వాడుతున్నారు. కొన్ని వాక్సిన్ లను తీవ్ర బాధితులకు కూడా అందిస్తున్నారు. అమెరికాలో ఫైజర్‌ కంపెనీ తయారు చేసిన వాక్సిన్ ట్రయల్స్‌లో పాల్గొన్న నలుగురికి అతి అరుదైన ముఖ పక్షవాతం లక్షణాలు వెలుగుచూశాయి.

అక్కడ ఈ వాక్సిన్ ను చాలా మంది వాలంటీర్లకు అందిస్తున్నారు. ఇప్పటివరకు అందించిన 19000 మందిలో నలుగురికి మాత్రం ఈ లక్షణాలు వెలుగుచూశాయి. కానీ ఫైజర్‌ కంపెనీ తయారు చేసిన టీకా అత్యవసర వినియోగానిక యూఎస్‌ ఎఫ్‌డీఏ (ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌) నుంచి అనుమతి పొందేందుకు సిద్ధంగా ఉంది. ఇందువల్ల ఆ కంపెనీ అలెర్జీ హెచ్చరికను జారీ చేయవచ్చని తెలుస్తుంది. బ్రిటన్‌లో వ్యాక్సిన్‌ అందించిన 24 గంటలలోపు అలెర్జీ హెచ్చరిక జారీ చేయబడింది.

ప్రస్తుతం ప్రభుత్వానికి చెందిన ఎన్‌హెచ్‌ఎస్‌లో టీకా తీసుకున్న నలుగురికి ఈ అలెర్జీ లక్షణాలు గృతించారు. కొవిడ్‌ -19 కు సంబంధించి బెల్‌ పాల్సీ (ముఖ పక్షవాతం) వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు. నవంబర్‌లో కొవిడ్‌-19 బారిన పడ్డ కొందరు గర్భిణులలో ముఖపక్షవాత లక్షణాలు గుర్తించారు. దీనివల్ల ముఖంలోని కండరాలు తాత్కాలిక బలహీనత లేదా పక్షవాతం అనుభవిస్తాయి. బాధితుల్లో ముఖ కండరాలు ఎర్రబడడం, వాపు, లేదా సంకోచం చెందుతాయని ప్రయోగాలు చెపుతున్నాయి.

Tags :

Advertisement