Advertisement

  • లాక్ డౌన్ తర్వాత రెండు లక్షల పానీపూరి ఆర్డర్లు డెలివరీ చేశాము...స్విగ్గీ

లాక్ డౌన్ తర్వాత రెండు లక్షల పానీపూరి ఆర్డర్లు డెలివరీ చేశాము...స్విగ్గీ

By: Sankar Tue, 22 Dec 2020 9:50 PM

లాక్ డౌన్ తర్వాత రెండు లక్షల పానీపూరి ఆర్డర్లు డెలివరీ చేశాము...స్విగ్గీ


కరోనా మహమ్మారి ,లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైపోయిన ఇండియన్స్‌ 2020లో సెకనుకు ఒక చికెన్‌ బిర్యానీ లాగించేశారట. స్విగ్గీ స్టేట్‌ఈటిక్స్ 2020 ప్రకారం, ఈ ఏడాది ప్రతి సెకనుకు బిర్యానీ ప్లేట్ ఒకటి కంటే ఎక్కువసార్లు ఆర్డర్‌ చేశారు.

ప్రతి వెజ్ బిర్యానీకి, ఆరు చికెన్ బిర్యానీ ఆర్డర్లు స్విగ్గీ అందుకుందట. "వెజ్, చికెన్, మటన్, ఆలూ ఇలా మొత్తంగా 2020లో ప్రతి సెకనుకు ఒకటి కంటే ఎక్కువ బిర్యానీని అర్డర్లను అందుకున్నామని స్వీగ్గీ మంగళవారం ప్రకటించింది.కరోనావైరస్ మహమ్మారి కారణంగా రెస్టారెంట్లు నెలల తరబడి మూసి వేయడంతో, నిబంధనల సడలింపు తరువాత తమ ఫుడ్‌ డెలివరీకి డిమాండ్ పెరిగిందని స్విగ్గీ తెలిపింది.

మైటీ చికెన్ బిర్యానీ దేశానికి అత్యంత ఇష్టమైన వంటకంగా నిలిచిందని పేర్కొంది. ఇంకా ‘పన్నీర్ బటర్ మసాలా', 'మసాలా దోస', 'చికెన్ ఫ్రైడ్ రైస్' 'మటన్ బిర్యానీ' వంటి వంటకాలు భారతదేశానికి ఇష్టమైన పిక్-మీ-అప్ వంటకాలుగా ఉన్నాయి. లాక్‌డౌన్‌ అనంతరం రెండు లక్షల 'పానిపురి' ఆర్డర్లను డెలివరీ చేశామని తెలిపింది.

Tags :
|
|
|

Advertisement