Advertisement

  • స్వర్ణ పాలస్ ఘటనలో విచారణకు హాజరు కావాలంటూ డాక్టర్ రమేష్ కు నోటీసులు

స్వర్ణ పాలస్ ఘటనలో విచారణకు హాజరు కావాలంటూ డాక్టర్ రమేష్ కు నోటీసులు

By: Sankar Tue, 22 Sept 2020 8:11 PM

స్వర్ణ పాలస్ ఘటనలో విచారణకు హాజరు కావాలంటూ డాక్టర్ రమేష్ కు నోటీసులు


తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన స్వర్ణా ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటన కేసులో డాక్టర్ రమేష్‌కు నోటీసులు అందాయి. విజయవాడ పీఎస్‌లో జరిగే విచారణకు హాజరు కావాలంటూ రమేష్‌కు సీఆర్పీసి సెక్షన్- 160 కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే.. కోవిడ్ తీవ్రత, సుప్రీంకోర్టు కస్టోడియల్ ఇంటరాగేషన్ చెయ్యవద్దని ఆదేశాలు ఇచ్చారని రమేష్ ఆస్పత్రి యాజమాన్యం చెబుతోంది. ఆన్‌లైన్ ద్వారా తాను విచారణకు సహకరిస్తానని రమేష్ బాబు తెలిపారు. అగ్ని ప్రమాదంలో పది మంది ప్రాణాలు కోల్పోవడానికి స్వర్ణా ప్యాలెస్ యాజమాన్యమే కారణమని, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ నివేదిక ఇచ్చిన విషయం విదితమే.

నోటీసుల ఇచ్చిన తరుణంలో రమేష్ ఆస్పత్రి యాజమాన్యం మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేసింది. ‘హోటల్ నిర్వహణకు పూర్తి బాధ్యత వహిస్తామని స్వర్ణా ప్యాలెస్ హోటల్ మేనేజింగ్ డైరెక్టర్ ముత్తవరపు శ్రీనివాసరావు చెప్పారు. ఆ హామీ తరువాతనే హోటల్ వారితో రమేష్ ఆస్పత్రి యాజమాన్యం ఒప్పందం కుదిరింది. మేం తీసుకునే నాటికే హోటల్ పెయిడ్ క్వారంటైన్ సెంటర్‌గా ప్రభుత్వం అనుమతితో స్వర్ణా ప్యాలెస్‌ను నిర్వహిస్తున్నారు.

హోటళ్ల నిర్వహణ, భవనానికి ఆక్యుపెన్సీ, ఫైర్ ఎన్ఓసీ తీసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా హోటల్ యాజమాన్యానిదే. కోవిడ్ రోగుల వైద్య చికిత్స కొరకు కొన్ని రూములు మాత్రమే రమేష్ హాస్పటల్ యాజమన్యానికి కేటాయించబడ్డాయి. ఎక్కడా కూడా లీజ్ ప్రసక్తే ఈ ఒప్పందంలో లేదు. రోగులకు కేటాయించిన రూములకు అద్దె నేరుగా హోటల్ యాజమాన్యమే వసూలు చేసుకుని రసీదు ఇవ్వడం జరిగింది’ అని ప్రకటనలో రమేష్ ఆస్పత్రి యాజమాన్యం పేర్కొంది.

Tags :
|

Advertisement