Advertisement

  • నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారనే అనుమానం.. ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..

నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారనే అనుమానం.. ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..

By: chandrasekar Fri, 20 Nov 2020 7:44 PM

నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారనే అనుమానం.. ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..


నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారనే అనుమానం ఉందని ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబుకు తొత్తుగా మారిపోయారని తీవ్ర వ్యాఖ్యానించారు. విశాఖపట్నం పర్యటనలో ఉన్న విజయసాయిరెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధికార ప్రతినిధిగా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఎన్నికలు పెట్టమంటే పెడుతున్నారు మరియు వద్దంటే మానేస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ కేడర్ చంద్రబాబు కంటే నిమ్మగడ్డ రమేష్‌ను ఎక్కుగా నమ్ముతున్నారని వ్యాఖ్యానించారు. నిమ్మగడ్డ రమేష్ రిటైర్మెంట్ తరువాత టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారనే అనుమానం మాకు ఉందని విజయసాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును దింపి టీడీపీ నేతలు నిమ్మగడ్డ రమేష్‌కు పగ్గాలు అప్పగిస్తారనే అనుమానం కలుగుతుందన్నారు. అలాగే రాజ్యాంగ నిబంధనలను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ తుంగలో తొక్కుతున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు.

కరోనా తీవ్రత అధికంగా వున్నా కూడా ఎన్నికలు నిర్వహించాలని అయన నిర్ణయించారని తెలిపారు. టీడీపీ నేతలతో స్టార్ హోటల్లో కూర్చొని మంతనాలు జరిపిన వ్యక్తి నిమ్మగడ్డ అని విమర్శించారు. కరోనా లేని సమయంలో ఎన్నికలు వాయిదా వేశారని, కరోనా ఎక్కువుగా ఉన్న సమయంలో ఎన్నికలు నిర్వహిస్తామంటున్నారని మండిపడ్డారు. ప్రజల ఆరోగ్యాన్ని నిమ్మగడ్డ రమేష్ పట్టించుకోలేదని చెప్పారు. పేదలకు ఇళ్లు ఇస్తామంటే దేశ చరిత్రలో అడ్డుకున్న పార్టీ టీడీపీ మాత్రమేనని, ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. అలాగే టీడీపీ ఎన్నారై పార్టీగా తయారయిందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు హైదరాబాద్ లో ఉండి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని చెప్పారు. అలాగే పోలవరం పూర్తి కాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే పక్క రాష్ట్రాలతో కేసులు వేయించారన్నారు. పోలవరం భూసేకరణ పూర్తి కాకుండా అడ్డుపడ్డారని పేర్కొన్నారు. పోలవరం దగ్గర 150 అడుగుల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం పెడతామంటే చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదన్నారు. 2021 డిసెంబర్‌ కల్లా పోలవరం పూర్తి చేస్తామని ప్రకటించారు. ఈ రకంగా విజయసాయి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Tags :

Advertisement