Advertisement

  • ఆసక్తికరమైన విషయాలు వెల్లడించిన సుశాంత్ మాజీ ప్రియురాలు

ఆసక్తికరమైన విషయాలు వెల్లడించిన సుశాంత్ మాజీ ప్రియురాలు

By: chandrasekar Sat, 01 Aug 2020 6:15 PM

ఆసక్తికరమైన విషయాలు వెల్లడించిన సుశాంత్ మాజీ ప్రియురాలు


సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ప్రియురాలు అంకితా పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. సుశాంత్ ఆత్మహత్య తనను షాక్ కు గురి చేసింది అని సుశాంత్ ఎప్పుడూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేవాడు అని తెలిపింది.

ఆత్మహత్య చేసుకునే రకం కాదని తెలిపింది. అంకితా లోఖాండే ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గురించి పలు రహస్యాలు వెల్లడించింది. సుశాంత్ నిత్యం కలలు కంటూ వాటిని సాకారం చేసుకునే పనిలో ఉండేవాడని తెలిపింది అంకితా.

సుశాంత్ వద్ద ఒక డైరీ ఉండేది అని అందులో వచ్చే ఐదు సంవత్సరాల్లో సాధించాలి అనుకున్న లక్ష్యాలను, కలలను రాసుకునే వాడు అని వెల్లడించింది. డైరీలో రాసుకున్న ప్రతీ కలను అతను సాకారం చేసుకున్నాడు అని సుశాంత్ ను ప్రజలు ఒక డిప్రెసెడ్ స్టార్ లా కాకుండా ఒక హీరోలా గుర్తుంచుకోవాలని అంకితా లోఖాండే కోరింది.

Tags :

Advertisement