Advertisement

  • పలు కోణాలు వెలుగు చూస్తున్నసుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు...

పలు కోణాలు వెలుగు చూస్తున్నసుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు...

By: chandrasekar Sat, 08 Aug 2020 2:47 PM

పలు కోణాలు వెలుగు చూస్తున్నసుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు...


సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో లోతుగా వెళ్లే కొద్ది పలు కోణాలు వెలుగు చూస్తున్నాయి. సుశాంత్‌ను కావాలనే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనే కోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఇప్పటికే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రబర్తిపై ఏ1 గా చేరుస్తూ కేసు ఫైల్ చేసింది. మరోవైపు ఈ సుశాంత్ ఆత్మహత్య కేసులో రియా చక్రబర్తి తల్లి తండ్రులను సోదరుడితోొ పాటు శామ్యూల్ మిరిండా, శృతి మోడీలను నిందితులుగా చేర్చింది సీబీఐ. మరోవైపు సుశాంత్ బాంద్రాలోని తన ఇంట్లో కన్నుమూసిన జూన్ 14 ముందు రియా చక్రబర్తికి సుశాంత్ అకౌంట్ నుంచి పెద్ద మొత్తంలో రియాకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయినట్లు తెలుస్తోంది.

సుశాంత్‌కు చెందిన కొటక్, హెచ్‌డీఎఫ్‌సీ అకౌంట్ నుంచి ఈ నగదు ట్రాన్స్‌ఫర్ అయినట్టు ED అధికారులు గుర్తించారు. ఆ డబ్బులతో రియా కుటుంబ సభ్యులు ముంబైలో కమర్షియల్ ఏరియాలో రెండు ప్రాపర్టీలు కొనుగోలు చేసారా అనే కోణంలో ED దర్యాప్తు చేస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. మరోవైపు ఈ కేసులో కీలకమైన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు చెందిన డైరీలో కొన్ని పేజీలు మిస్ అయినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ సంఘటనతో సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదనడానికి ఉన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ డైరీలో సుశాంత్ తన రోజువారీ సంబంధించిన విషయాలను రాసేవాడేని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

అటు బీజేపీ రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి, లాయర్ షెహదాద్ పూనావాలా కూడా డైరీలో పేజీలు మాయమైన విషయాన్ని ప్రస్తావించారు. ముంబై పోలీసులు కావాలనే ఈ విషయాన్ని తెలియకుండా చేసారన్నారు. అందుకే సుశాంత్ సింగ్ మృతిపై సీబీఐ ఎంక్వైరీ చేయాలని వాళ్లు కోరిన సంగతి తెలిసిందే కదా. కేంద్రం కూడా వెంటనే సుశాంత్ సింగ్ కేసులో సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించినట్టు సుప్రీంకోర్టుకు తెలిపింది. సుప్రీంకోర్టు సుశాంత్ మృతిపై సీబీఐ ఎంక్వైరీ ఆదేశించింది. వెంటనే ఈ కేసు విషయమై సీబీఐ రంగంలోకి దిగింది. ఇప్పటికే సీబీఐ ముంబై పోలీసులతో పాటు బిహార్ పోలీసుల నుంచి ఈ కేసు విషయమై పలు ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు.

బిహార్ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు విషయమై ఎంక్వైరీకి సీబీఐ అధికారులకు ప్రత్యేక అనుమతులు జారీ చేసింది. కానీ ఈ సుశాంత్ ముంబైలో ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సీబీఐకు ప్రత్యేక అనుమతి ఇస్తే కానీ ఎంక్వైరీ చేయడానికి వీలు లేదు. ఈ కేసును సీబీఐ స్పెషల్ క్రైమ్ యూనిట్ దర్యాప్తు చేస్తుంది కాబట్టి సీబీఐ దర్యాప్తుకు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతి తప్పనిసరి అంటున్నారు. సీబీఐ ఎంక్వైరీకి సుప్రీంకోర్టు ఆదేశిస్తే ఫెడరల్ దర్యాప్తుకు ఆయా రాష్ట్రాల అనుమతి అవసరం లేదనేది సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లు చెబుతున్నారు. మొత్తంగా సీబీఐ ఎంక్వైరీతో సుశాంత్ మృతి వెనక ఉన్న అసలు రహస్యాలు బయటకు వస్తాయని నమ్మకంతో ఆయన అభిమానులువేచి ఉన్నారు.

Tags :
|
|

Advertisement