Advertisement

  • సూర్యకుమార్ ను అందుకే ఇండియన్ టీంలోకి తీసుకోలేదు..

సూర్యకుమార్ ను అందుకే ఇండియన్ టీంలోకి తీసుకోలేదు..

By: Sankar Sun, 01 Nov 2020 3:44 PM

సూర్యకుమార్ ను అందుకే ఇండియన్ టీంలోకి తీసుకోలేదు..


ఈ ఏడాది యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2020 తర్వాత భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. ఈ టూర్ కు వెళ్లే భారత జట్లను బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది.

అయితే ఈ జట్లను ప్రకటించిన సమయం నుండే గందరగోళం మొదలయ్యింది. ఈ ఏడాది ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్ ను జట్టులోకి ఎందుకు తీసుకోలేదు అని బీసీసీఐని చాల మంది ప్రశ్నించారు. భారత బౌలర్ హర్భజన్ సింగ్ కూడా ట్విట్టర్ లో ''అతని రికార్డులు ఒకసారి చుడండి'' అని పోస్ట్ చేసాడు.

అయితే బీసీసీఐ జట్లను ప్రకటించిన తర్వాత ముంబై ఇండియన్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మధ్య మ్యాచ్ జరిగింది. అందులో సూర్యకుమార్ అర్ధశతకం తో చెలరేగి జట్టుకు విజయాన్ని అందించాడు. దాంతో ఆసీస్ టూర్ కు అతడిని ఎంపిక చేయకపోవడం పై బీసీసీఐ మీద విమర్శలు మరి ఎక్కువయ్యాయి. అయితే ఇప్పుడు అతడిని ఆసీస్ పర్యటనకు ఎంపిక చేయకపోవడం పై ఓ క్లారిటీ వచ్చింది.

అదేంటంటే... సూర్యకుమార్ ఈ ఏడాది ఐపీఎల్ లో రాణిస్తున్న... డొమెస్టిక్ క్రికెట్ లో చాలా వెనుకపడిపోయాడు. డొమెస్టిక్ క్రికెట్ లో సూర్యకుమార్ కంటే మనీష్ పాండే, శ్రేయాస్ అయ్యర్, పృథ్వీ షా, శుబ్మన్ గిల్ అలాగే ఐపీఎల్ లోకి ఈ ఏడాదే ఎంట్రీ ఇచ్చిన దేవదత్ పడికల్ కూడా మెరుగైన ప్రదర్శన చేసారు. అందుకే అతడిని జట్టులోకి తీసుకోలేదు అని తెలుస్తుంది. ఇక కేరళ ఆటగాడు అయిన సంజూ శాంసన్ కూడా డొమెస్టిక్ క్రికెట్ లో అంతగా రాణించలేదు. కానీ అతను వికెట్ కీపర్ అనే కారణంగానే భారత టీ 20 జట్టులోకి తీసుకున్నారు.

Tags :

Advertisement