Advertisement

  • సూర్య కుమార్ కీవిస్ జట్టు తరుపున అంతర్జాతీయ క్రికెట్‌ ఆడవచ్చు

సూర్య కుమార్ కీవిస్ జట్టు తరుపున అంతర్జాతీయ క్రికెట్‌ ఆడవచ్చు

By: chandrasekar Fri, 30 Oct 2020 6:57 PM

సూర్య కుమార్ కీవిస్ జట్టు తరుపున అంతర్జాతీయ క్రికెట్‌ ఆడవచ్చు


ఐపీఎల్‌ 13వ సీజన్ ఫ్లేఆఫ్ ముంబై స్టార్ బాట్స్‌మెన్ సూర్యకుమార్ ఆస్ట్రేలియా సిరీస్‌కు భారత జట్టులో చోటు దక్కకపోవడంపై చాలా మంది సీనియర్స్ క్రికెటర్స్ బీసీసీఐ మీద ఫైర్ అవుతున్నారు. తాజాగా న్యూజిలాండ్‌ మాజీ ఆల్‌రౌండర్‌ స్కాట్‌ స్టైరిస్‌ స్పందించాడు. "సూర్య కుమార్ యాదవ్ న్యూజిలాండ్‌ జట్టు తరుపున అంతర్జాతీయ క్రికెట్‌ ఆడవచ్చు" అని అన్నారు

స్టైరిస్‌ తాజాగా పలువురు అభిమానులు అడిగిన ప్రశ్నలు సమాధానం ఇచ్చారు. మీకు నచ్చని జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎందుకు అగ్రస్థానంలో ఉంటుందని..? ఓ అభిమాని అడగ్గా " సహజంగా మనం అన్ని జట్లను ఇష్టపడలేం.. ఖచ్చితంగా ఏదో జట్టుపై అయిష్టం ఉంటుంది" అంటూ సమాధానం ఇచ్చాడు. అలానే సూర్య కుమార్ ఆటతీరును స్టైరిస్‌ కొనియాడరు. ముంబై ఇండియన్స్,బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య జరిగిన మ్యా్చ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ అద్భుతంగా రాణించాడు. ఈ గెలుపుతో ముంబయి ప్లేఆఫ్స్‌లో బెర్తు ఖరారు చేసుకుంది. సూర్య సూర్యకుమార్‌ ఆడిన ఇన్నింగ్స్‌పై దిగ్గజ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘సూర్యకుమార్‌ యాదవ్‌ బ్యాటింగ్ చాలా అద్భుతం.. అది నాకు చాలా ఇష్టం.. సఫారీ మాజీ ఆటగాడు అని జేపీ డుమిని అన్నారు. హైదరాబాద్ మాజీ స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా కూడా సూర్యపై ట ట్వీట్‌ చేశాడు ‘ ఆ ఆకాశం అనంతమైనది’ అంటూ ప్రశపించారు.

ఇక ప్రముఖ వ్యాఖ్యాత హర్ష భోగ్లే కూడా సూర్య పోగడ్తలతో ముంచెత్తారు. ‘సూర్యకుమార్‌ ఆసీస్ టూర్ వెళ్లాల్సిన వాడు’ అంటూ తెలిపారు. ఇక ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన భారత జట్టు కూర్పులో ముంబై బ్యాట్స్‌మన్‌ సూర్య కుమార్‌ యాదవ్‌కు జట్టులో చోటు దక్కకపోవడంపై ఫైరయ్యారు. దేశవాళీ టోర్నీలతో పాటు ఐపీఎల్‌లో అద్భుతంగా రాణిస్తున్నా ఈ యంగ్ ఫ్లేయర్‌ను ఎందుకు ఎంపిక చేయలేదంటూ ట్వీట్టర్ వేదికగా బీసీసీఐపై తీవ్ర విమర్శలు చేశాడు. "భారత జట్టులో చోటు సంపాదించాలంటే సూర్య కుమార్‌ ఇంకా ఏం చేయాలి. ఐపీఎల్,రంజీ ట్రోఫీల్లో తనదైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. బీసీసీఐ జట్టు ఎంపికలో పాటించే నిబంధనలు ఒక్కొక్కరికి ఒక్కొ విధంగా ఉన్నాయేమో, సూర్య కుమార్‌ రికార్డులను సెలెక్టర్లు పరిశీలించాలని" హర్భజన్‌ తెలిపాడు.

Tags :
|

Advertisement