Advertisement

  • అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కు షాకిస్తున్న సర్వే లు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కు షాకిస్తున్న సర్వే లు

By: Sankar Sun, 11 Oct 2020 10:16 AM

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కు షాకిస్తున్న సర్వే లు


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ శిబిరంలో కలవరం మొదలైంది.. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ట్రంప్‌తోపోలిస్తే.. బైడెన్ ఆధిక్యత పెరుగుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. దీంతో.. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాలనుకుంటున్న ట్రంప్‌ కలలు కల్లలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఎత్తులు వేస్తున్నా.. అవి ఫలిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.

అమెరికన్ పౌరులలో రోజురోజుకూ ట్రంప్ పట్ల వ్యతిరేకత పెరుగుతోందే తప్పా తగ్గడం లేదు. తాజా సర్వేలు సైతం ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ట్రంప్ కన్నా ప్రత్యర్థి బైడెన్ ప్రజాదరణలో 7 నుంచి 8 శాతం ఆధిక్యతలో ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఈ పరిణామాలు ట్రంప్ శిబిరంలో ఆందోళన కలిగిస్తున్నాయి.

కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో ట్రంప్ సర్కార్ విఫలమైందన్న అభిప్రాయం అమెరికన్లలో బలంగా వ్యక్తమవుతోంది. దీన్ని బైడెన్ శిబిరం జనంలోకి తీసుకెళ్లడంలో విజయవంతమైనట్లు కనిపిస్తోంది. దీనికి తోడు ఒబామా కేర్ రద్దు చేయడంపైనా అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. పెరుగుతున్న నిరుద్యోగిత, ఫ్లాయిడ్ ఉదంతంతో నల్లజాతీయులలో అభద్రత పెరగడం, ముస్లిం యువత కూడా .. విపక్షం వైపే చూస్తున్నట్లు తాజా సర్వేల్లో కనిపిస్తోంది.

ఈ పరిణామాలతోనే తాను ఓడిపోయినా, అధికార మార్పిడి అంత ఈజీగా జరగదని ట్రంప్ సంకేతాలిస్తున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓ వేళ బైడెన్ గెలిచినా రెండు నెలల ముచ్చటేనని.. తర్వాత కమలా హ్యారిస్ ఆ పదవిని లాక్కుంటారని ట్రంప్ ట్వీట్స్ సైతం చేశారు. ఓ వైపు కరోనా సోకిన తర్వాత కూడా ట్రంప్... పూర్తిగా కోలుకోకుండానే కారు షికారు చేయడం కలకలం రేపింది.

Tags :

Advertisement