Advertisement

  • తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మరియు వృద్ధిపై సర్వే

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మరియు వృద్ధిపై సర్వే

By: chandrasekar Thu, 27 Aug 2020 7:32 PM

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మరియు వృద్ధిపై సర్వే


అనతికాలంలో అందనంత రీతిలో వ్యాపిస్తున్న కరోనా ని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు అందుకే చర్యలు తీసికొంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ ప్రజలలో కరోనా సామాజిక వ్యాప్తి? వివిధ వయస్సులవారిపై దాని ప్రభావం? ప్రతిరక్షకాలు ఎలా వృద్ధిచెందుతున్నాయనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌ఐఎన్‌) సంయుక్తంగా సెరో- ఎపిడెమియోలాజికల్‌ సర్వే నిర్వహిస్తున్నాయి.

దీనిద్వారా గుర్తించిన వివరాలను బట్టి కరోనా ని కట్టడి చేయడానికి తగు చర్యలు తీసికోనున్నట్లు తెలిపారు. ఈ సర్వే రెండోదశ బుధవారం ప్రారంభమైంది. జనగామ, కామారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో సర్వే నిర్వహిస్తున్నారు. 1,200 వరకు రక్త నమూనాలను సేకరించి, సీరమ్‌ను వేరుచేసి కరోనా యాంటీబాడీలను గుర్తిస్తారు. ప్రతిరక్షకాలు ఎలా వృద్ధిచెందాయనే విషయాన్ని నిర్ధారిస్తారు.

తొలిదశకి జరిపిన సర్వేలో 3 శాతమే సామాజిక వ్యాప్తి ఉన్నట్టు తేలిందని ఎన్‌ఐఎన్‌ సీనియర్‌ శాస్త్రవేత్త జీఎం సుబ్బారావు తెలిపారు. ఈ సర్వేతో అప్పటికీ, ఇప్పటికీ తేడా తెలుసుకోవచ్చన్నారు. కానీ ఇప్పుడు ఆన్ లాక్ ప్రకటించడంతో వ్యాప్తి మరింత పెరిగినట్లు తెలిపారు.

Tags :
|

Advertisement