Advertisement

  • టీమిండియా అత్యుత్తమ కెప్టెన్ ధోని ..0.4 శాతం ఓట్ల తేడాతో ధోనీనే బెస్ట్ అని తేల్చిన స్టార్ స్పోర్ట్స్ సర్వే

టీమిండియా అత్యుత్తమ కెప్టెన్ ధోని ..0.4 శాతం ఓట్ల తేడాతో ధోనీనే బెస్ట్ అని తేల్చిన స్టార్ స్పోర్ట్స్ సర్వే

By: Sankar Tue, 14 July 2020 10:31 AM

టీమిండియా అత్యుత్తమ కెప్టెన్ ధోని ..0.4 శాతం ఓట్ల తేడాతో ధోనీనే బెస్ట్ అని తేల్చిన స్టార్ స్పోర్ట్స్ సర్వే



సౌరవ్ గంగూలీ , మహేంద్ర సింగ్ ధోని టీమిండియాకు టీంఇండియా కు ఇప్పటిదాకా పని చేసిన ఇద్దరు అత్యుత్తమ కెప్టెన్లు ..ఒకరు కష్టాల్లో ఉన్న టీంను ఆ కష్టాల నుంచి బయటపడి మ్యాచ్ విన్నర్లను తయారు చేస్తే , మరొకరు ఆ మ్యాచ్ విన్నర్లను సరైన పద్దతిలో వినియోగించుకొని మూడు ఐసీసీ ట్రోఫీలు అందించారు ..ఇలా ఈ ఇద్దరిలో ఏ ఒక్కరిని తక్కువ చేయలేము ..ఇద్దరిలో ఎవరు అత్యుత్తమం అంటే కూడా వెంటనే ఒక్కరి పేరు చెప్పలేము ..కానీ స్టార్ట్ స్పోర్ట్స్ మాత్రం ఈ ఇద్దరిలో ఎవరు అత్యుత్తమ కెప్టెన్ అనేది తెలుసుకోవడం కోసం వారి ఇద్దరి రికార్డులను విశ్లేషించి ఒక సర్వే ఆధారంగా కేవలం 0.4 శాతం తేడాతో ధోని అత్యుత్తమ కెప్టెన్ గా తేల్చింది ..

సర్వేలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాజీ క్రికెటర్లు పాల్గొనగా.. జ్యూరీలో జర్నలిస్ట్‌లు, మాజీ క్రికెటర్లు, బ్రాడ్‌కాస్టర్స్‌‌కి అవకాశం కల్పించారు. క్లిష్ట పరిస్థితుల్లో జట్టుని మెరుగ్గా తీర్చిదిద్దడం.. ఆ తర్వాత అదే బెస్ట్ టీమ్‌ని తర్వాత కెప్టెన్‌కి అప్పగించడంలో గంగూలీకి మంచి మార్కులు పడగా.. ఐసీసీ వరల్డ్‌‌కప్‌లు గెలవడం, కెప్టెన్‌గా ఉన్న సమయంలో మెరుగ్గా బ్యాటింగ్ చేయడం ధోనీకి కలిసొచ్చింది. మొత్తంగా.. కొద్ది తేడాతో గంగూలీపై ధోనీ పైచేయి సాధించాడు.

ఈ ఇద్దరి కెప్టెన్ల రికార్డులను పరిశీలిస్తే భారత్ గడ్డపై 21 టెస్టులకి కెప్టెన్సీ వహించిన గంగూలీ 47.6 శాతం విజయాల్ని అందుకోగా.. ధోనీ 30 టెస్టుల్లో 70 శాతం గెలుపు రికార్డ్‌‌ని సొంతం చేసుకున్నాడు. ఇక విదేశాల్లో 29 టెస్టులకిగానూ గంగూలీ 39 శాతం, 30 టెస్టుల్లో కేవలం 20 శాతం మాత్రమే గెలుపు రికార్డ్‌ని ధోనీ నమోదు చేశారు. వన్డేలపరంగా చూసుకుంటే మొత్తంగా 146 మ్యాచ్‌లకి కెప్టెన్సీ వహించిన గంగూలీ 76 మ్యాచ్‌ల్లో టీమ్‌ని గెలిపించాడు. మరోవైపు ధోనీ 200 మ్యాచ్‌లకిగానూ 110 మ్యాచ్‌ల్లో విజయాల్ని అందించాడు. కెప్టెన్‌గా ఉన్న సమయంలో ఒక బ్యాట్స్‌మెన్‌గానూ గంగూలీపై ధోనీదే పైచేయిగా కనిపిస్తోంది. గంగూలీ 49 టెస్టుల్లో 37.66 సగటుతో 2,561 పరుగులు చేయగా.. ధోనీ 60 టెస్టుల్లో 40.66 సగటుతో 3,454 పరుగులు చేశాడు. అలానే 142 వన్డేల్లో గంగూలీ 38.79 సగటుతో 5,082 పరుగులు చేయగా.. ధోనీ 172 వన్డేల్లో 53.55 సగటుతో 6,641 పరుగులు చేశాడు.

ఇందులో ప్రతి అంశానికి పాయింట్లు కేటాయించారు ..కొన్ని అంశాలలో గంగూలీ , మరికొన్నీ అంశాలలో ధోని పైచేయి సాధించారు ..ఇలా అన్నిటిని కౌంట్ చేయగా కేవలం 0.4 శాతం తోనే ధోని పైచేయి సాధించడం చూస్తే ..ఈ ఇద్దరు కెప్టెన్లలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు అన్న విషయం స్పష్టంగా అర్థం అవుతుంది ..


Tags :
|
|

Advertisement