Advertisement

  • నా స్థానంలో అతడు ఆడితే బాగుంటుంది..సురేష్ రైనా

నా స్థానంలో అతడు ఆడితే బాగుంటుంది..సురేష్ రైనా

By: Sankar Wed, 09 Sept 2020 10:08 AM

నా స్థానంలో అతడు ఆడితే బాగుంటుంది..సురేష్ రైనా


చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఎంత మంది ఆటగాళ్లు వచ్చి పోయిన కూడా మహెచ్డీన్రా సింగ్ ధోని , సురేష్ రైన్ మాత్రం ఐపీయల్ ఆరంభం నుంచి చెన్నై భారాన్ని మోస్తున్నారు..ధోని కెప్టెన్ గా , ఫినిషర్ గా రాణిస్తే , రైనా తన బ్యాటింగ్ తో మిస్టర్ ఐపీయల్ గా పేరు సంపాదించాడు..అయితే కొన్ని అనుకోని కారణాల వాళ్ళ రైనా ఈ ఏడాది ఐపీయల్ కు అర్దాంతరంగా దూరం అయ్యాడు..దీనితో జట్టులో కీలక వన్ డౌన్ స్థానం ఖాలీ అయింది ..

అతని స్థానంలో చెన్నై యాజమాన్యం ఇంకా ఎవరిని తీసుకోలేదు. కరోనా బారిన పడిన ఆ జట్టు ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ వన్ డౌన్ లో ఆడుతాడు అని అందరూ అనుకుంటున్నారు. కానీ తన స్థానం లో ధోని ఆడితే బాగుంటుంది అని తాజాగా రైనా అభిప్రాయపడ్డాడు. అయితే భారత జట్టుకు కూడా కొన్ని మ్యాచ్ లలో ఆ స్థానం లో ఆడిన అనుభవం ధోనికి ఉంది. 2005 లో పాకిస్థాన్ ‌పై 3 వ స్థానంలో ఆడిన ధోని 148 పరుగులు చేసిన ఆ వన్డే ను ఎలా మర్చిపోగలము. జట్టులో నెం.3 స్థానం చాలా కీలకం. ఆ స్థానానికి ధోని అయితే న్యాయం చేయగలడు అని రైనా అన్నాడు. సి

జట్టుకు చాలా సీజన్లు నెం.3 లో ఆడిన రైనా మిస్టర్ ఐపీఎల్ గా పేరు సంపాదించాడు. పరిస్థితులకు అనువుగా పరుగులు చేసే రైనా ఇప్పటివరకు 193 మ్యాచ్ లు ఆడి 5,368 పరుగులు చేసాడు. దాంతో రైనా స్థానం లో ఆడే క్రికెటర్ కూడా ఆ స్థాయి లో ఆడాలని అందరూ అనుకుంటున్నారు. అందుకే ధోని అయితే ఆ స్థానానికి సరిపోతాడని రైనా అంటున్నాడు.

Tags :
|
|
|

Advertisement