Advertisement

  • స్థాయికి తగ్గట్లు ఆడితే పంత్ అంటే ఏంటో ప్రపంచానికి తెలుస్తుంది ..రైనా

స్థాయికి తగ్గట్లు ఆడితే పంత్ అంటే ఏంటో ప్రపంచానికి తెలుస్తుంది ..రైనా

By: Sankar Mon, 20 July 2020 9:15 PM

స్థాయికి తగ్గట్లు ఆడితే పంత్ అంటే ఏంటో ప్రపంచానికి తెలుస్తుంది ..రైనా



దేశ‌వ్యాప్తంగా కరోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కార‌ణంగా క్రికెట‌ర్లు ఇండ్ల‌కే ప‌రిమిత‌మైన స‌మ‌యంలో సురేశ్ రైనా, రిష‌బ్ పంత్ మాత్రం ఏంచ‌క్కా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్ర‌త్యేక‌మైన వ‌స‌తుల మ‌ధ్య వీరిద్ద‌రూ నెట్స్‌లో శ్ర‌మిస్తున్నారు. పంత్‌లో ఉన్న స‌హ‌జ నైపుణ్యం మేర‌కు ఆడితే అత‌డు చ‌క్క‌టి ఫ‌లితాలు రాబ‌ట్ట‌గ‌ల‌డ‌ని ఈ సంద‌ర్భంగా రైనా అన్నాడు. ధోనీ గైర్హాజ‌రీలో జ‌ట్టులో చోటు సుస్థిరం చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న పంత్‌పై రైనా ప్ర‌శంస‌లు కురిపించాడు..

`అత‌డి (పంత్‌)లో ప్ర‌తిభ‌క‌కు కొద‌వ లేదు. నా లెక్క ప్ర‌కారం స్థాయికి త‌గ్గ‌ట్లు ఆడితే.. అత‌డి సత్తా ఏంటో ప్ర‌పంచానికి తెలుస్తుంది`అని రైనా అన్నాడు. ఇక పంత్ మాట్లాడుతూ.. `ఐదారు నెల‌ల త‌ర్వాత తిరిగి బ్యాట్ ప‌ట్ట‌డం కాస్త కొత్త‌గా ఉంది. మెరుగ‌య్యేందుకు కృషి చేస్తున్నా. రైనా చాలా స‌హాయం చేస్తున్నాడు. అలాంటి అనుభ‌వ‌జ్ఞుల‌తో క‌లిసి ఆడితే మ‌న లోపాలు తెలుస్తాయి. మా మ‌ధ్య క్రికెట్ గురించే ఎక్కువ చ‌ర్చ సాగుతుంది. అది నాకు చాలా ఉప‌యోగ‌క‌రంగా ఉంది` అని అన్నాడు.

పంత్ గురించే భారత మాజీ ఆటగాడు కీర్తి ఆజాద్ కూడా మాట్లాడుతూ అతడు అత్యంత టాలెంట్ ఉన్న ఆటగాడు ..కానీ అతడు తన వికెట్ కు వేల్యూ ఇవ్వడం నేర్చుకోవాలి ..బరిలోకి దిగిన వెంటనే సిక్సర్లు , ఫోర్లు కొట్టాలంటే కుదరదు స్ట్రైక్ రొటేట్ చేయడం కూడా నేర్చుకోవాలి ...అతడు టీం లేకపోతే మాత్రం ఒక మంచి టాలెంట్ వేస్ట్ అయింది అని నేను బాధపడతా అని అన్నాడు ఈ మాజీ ఆటగాడు ..

Tags :
|

Advertisement