Advertisement

  • అతడు కనుక నాలుగో స్థానంలో బరిలోకి దిగి ఉంటే టీమిండియా ప్రపంచ కప్ విజయం సాధించేది..సురేశ్‌ రైనా

అతడు కనుక నాలుగో స్థానంలో బరిలోకి దిగి ఉంటే టీమిండియా ప్రపంచ కప్ విజయం సాధించేది..సురేశ్‌ రైనా

By: Sankar Sun, 23 Aug 2020 09:52 AM

అతడు కనుక నాలుగో స్థానంలో బరిలోకి దిగి ఉంటే టీమిండియా ప్రపంచ కప్ విజయం సాధించేది..సురేశ్‌ రైనా


గత ఏడాది జరిగిన ప్రపంచ కప్ లో టీమిండియా సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలు అయినా విషయం తెలిసిందే..అయితే ఆ ప్రపంచ కప్ లో అంబటి రాయుడి స్థానములో విజయ్ శంకర్ ను జట్టులోకి తీసుకోవడం మీద తీవ్ర విమర్శలు చెలరేగాయి..ఇక ఈ తమిళనాడు క్రికెటర్‌ను ఎంపిక చేయడాన్ని సమర్థించుకుంటూ శంకర్‌ 3డీ ప్లేయర్‌(బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌) అంటూ సెలక్టర్‌ ఎంఎస్‌కే చేసిన కామెంట్స్‌పై రాయుడు కూడా అంతే ఘాటుగా స్పందించడం వివాదానికి దారితీసింది.

ఈ నేపథ్యంలో ఆనాటి పరిస్థితుల గురించి క్రిక్‌బజ్‌తో మాట్లాడిన సురేశ్‌ రైనా.. ‘‘ రాయుడు కష్టపడే తత్వం ఉన్నవాడు. తననెప్పుడూ నంబర్‌.4 ప్లేస్‌లో చూడాలని భావించేవాడిని. నిజానికి 2018 నాటి టూర్‌ను నేను ఏమాత్రం ఆస్వాదించలేకపోయాను. అప్పుడు రాయుడు ఫిట్‌నెస్‌ టెస్టులో విఫలం కావడంతో తన స్థానంలో నన్ను సెలక్ట్‌ చేయడం అంతగా నచ్చలేదు. అంతేకాదు ప్రపంచ కప్‌ సమయంలో కూడా తను జట్టుతో లేకపోవడం ప్రభావం చూపింది.

ఒకవేళ తను ఉండి ఉంటే మేం టోర్నమెంట్‌ గెలిచేవాళ్లం. చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆడే సమయంలో తన ఆటను దగ్గరగా గమనించాను. తనెంతో బాగా బ్యాటింగ్‌ చేస్తాడు’’అని రాయుడికి విషయంలో సెలక్టర్లు వ్యవహరించిన తీరును పరోక్షంగా ప్రస్తావించాడు.కాగా విజయ్‌ శంకర్‌ గాయంతో తిరిగి స్వదేశానికి వచ్చిన్పటికీ మరోసారి రాయుడికి హ్యాండిచ్చిన సెలక్టర్లు.. రిషభ్‌ పంత్‌ను ఇంగ్లండ్‌కు పిలిపించారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన రాయుడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించి.. కొన్నాళ్ల తర్వాత తన మాట వెనక్కి తీసుకున్నాడు

Tags :

Advertisement