Advertisement

  • చెన్నై సూపర్‌ కింగ్స్‌ శిబిరానికి రైనా సంకేతాలు

చెన్నై సూపర్‌ కింగ్స్‌ శిబిరానికి రైనా సంకేతాలు

By: Dimple Thu, 03 Sept 2020 00:52 AM

చెన్నై సూపర్‌ కింగ్స్‌ శిబిరానికి రైనా సంకేతాలు

దుబాయ్‌ ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభం దగ్గర పడుతున్న కొద్దీ... అభిమానుల్లో ఉత్సాహం ఉప్పొంగుతోంది. ఆటగాళ్లందరూ దుబాయ్‌ చేరుకున్న తర్వాత.. వారంరోజుల క్వారంటైన్‌ పూర్తి చేసుకుని ప్రాక్టీస్‌ కోసం మైదానాల్లోకొచ్చే సమయంలో పిడుగులాంటి వార్తలు అభిమానుల్ని కలచివేశాయి. చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టులో కరోనాకలవరం... ఆ తర్వాత రైనా ఇండియాకి తిరుగుప్రయాణం... క్రికెట్‌ అభిమానుల్ని నిరాశపరచింది... రైనా స్థానంలో కనీసం కొన్ని రోజులపాటు ఆడేందుకు ప్రత్యాయ్నాయం చూస్తున్న నేపథ్యంలో.... రైనానుంచి సానుకూల సంకేతాలు అందాయి.... క్రికెట్‌ వార్తలను ఎప్పటికప్పుడు అందించే క్రిక్‌బజ్‌కు... ఎన్డీటీవీ లకు రైనా అందించిన సమాచారం చెన్నై సూపర్‌ కింగ్స్‌ శిబిరాన్ని ఆనందంలో ముంచెత్తింది. కోవిడ్ పాజిటివ్‌ కోరల్లోంచి చెన్నై శిబిరం కోలుకుంటున్న తరుణంలో నిర్భందగదుల్లో కసరత్తుచేస్తున్న రైనా సహ ఆటగాళ్లు సంతోషిస్తున్నారు..... ఇండియాలో ఉంటున్న రైనా ఐపీఎల్ నుంచి తప్పుకోవడంపై రైనా పూర్తి క్లారిటీ ఇచ్చాడు. రైనా... ఐపీఎల్‌ మ్యాచుల్లో ఆడేందుకు దుబాయ్‌కి వెళ్లే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఐపీఎల్‌ మ్యాచులకు రైనా దూరం కాబోడనే సంకేతాలు చెన్నై శిబిరాన్ని సంతోషింపజేస్తోంది.

ఐపీఎల్ లో మోస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టీమ్ చెన్నై సూపర్ కింగ్స్... అలాంటి టీమ్ లో స్టార్ ప్లేయర్ సురేష్ రైనా... ఐపీఎల్ ఆరంభానికి మూడు వారాల ముందు అందరికీ షాకిస్తూ రైనా స్వదేశానికి తిరిగొచ్చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. హోటల్ రూమ్ నచ్చలేదని కొందరు... బంధువులు ప్రమాదానికి గురవడంతోనే వచ్చాడని మరికొందరు.. కోవిడ్ భయంతోనే తప్పుకున్నాడంటూ రకరకాల కథనాలు వచ్చాయి. అయితే తాను ఐపీఎల్ నుంచి వెనక్కి రావడంపై ఇప్పుడు స్వయంగా రైనానే క్లారిటీ ఇచ్చాడు. మేనత్త కుటుంబానికి జరిగిన ఘటన ఒక కారణంగా ఉంటే... కోవిడ్ భయంతోనే అన్నది మరో కారణంగా తేలింది. ఓ క్రికెట్ వెబ్ సైట్ తో ప్రత్యేకంగా మాట్లాడిన రైనా దీనిపై స్పందించాడు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకున్నారని, అసలు నిజం తనకు మాత్రమే తెలుసంటూ వివరణ ఇచ్చాడు.

అసలు హోటల్ రూమ్ పై ఎటువంటి గొడవా లేదన్న రైనా కోవిడ్ ఆందోళనతో పాటు మేనత్త కుటుంబానికి జరిగిన ప్రమాదం తాను స్వదేశానికి తిరిగి వచ్చినట్టు చెప్పాడు. తాను చెన్నైకి ఆడడం ఇష్టం లేని వాళ్ళు కొన్ని అవాస్తవ కథనాలు ప్రచారం చేశారని అవన్నీ గాలివార్తలేనని కొట్టిపారేశాడు. మళ్లీ తాను దుబాయ్ వచ్చి ఐపీఎల్ ఆడినా ఆశ్చర్యం లేదన్నాడు. కారణం లేకుండా 12.5 కోట్లు ఎవరైనా వదులుకుంటారా అని ప్రశ్నించాడు. కుటుంబానికే తన తొలి ప్రాధాన్యతగా పేర్కొన్న రైనా చెన్నై ఫ్రాంచైజీలో కరోనా కలకలం రేగినప్పుడు తన పిల్లలు, భార్య కళ్ళ ముందు మెదిలారన్నాడు. తమది చాలా పెద్ద కుటుంబమని , అందుకే ఎక్కువ టెన్షన్ పడినట్టు అసలు విషయం చెప్పాడు ఈ స్టార్ ప్లేయర్.

కాగా శ్రీనివాసన్ వ్యాఖ్యలు పూర్తిగా మరో కోణంలో తీసుకున్నారన్నాడు. శ్రీనివాసన్ తనకు తండ్రి లాంటి వారని, అలాంటి వ్యక్తి మందలించినా ఏం బాధపడనని చెప్పాడు. కాగా కోవిడ్ బారిన పడిన చెన్నై క్రికెటర్లు, సహాయక సిబ్బంది త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. ఇదిలా ఉంటే రైనా తాజా స్టేట్ మెంట్ తో అటు క్రికెట్ వర్గాల్లో నెలకొన్న గందరగోళానికి తెరపడితే... ఇటు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ లో జోష్ కనిపిస్తోంది. మళ్లీ వచ్చినా వస్తానంటూ రైనా క్లారిటీ ఇవ్వడం, ఇప్పటి వరకూ సీఎస్ కే ఫ్రాంచైజీ అతని స్థానంలో రీ ప్లేస్ తీసుకోకపోవడంతో మళ్ళీ ఈ సీజన్ లో రైనా కనిపించడంపై ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.

Tags :
|
|
|

Advertisement