Advertisement

  • క్రిమినల్ కేసులు ఉన్న చట్టసభల సభ్యులను అరెస్ట్ చేయడంలో నిర్లక్ష్యం ...పోలీసులపై సీరియస్ అయిన సుప్రీమ్ కోర్ట్

క్రిమినల్ కేసులు ఉన్న చట్టసభల సభ్యులను అరెస్ట్ చేయడంలో నిర్లక్ష్యం ...పోలీసులపై సీరియస్ అయిన సుప్రీమ్ కోర్ట్

By: Sankar Wed, 07 Oct 2020 11:16 AM

క్రిమినల్ కేసులు ఉన్న చట్టసభల సభ్యులను అరెస్ట్ చేయడంలో నిర్లక్ష్యం ...పోలీసులపై సీరియస్ అయిన సుప్రీమ్ కోర్ట్


క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్న చట్ట సభల సభ్యులను అరెస్ట్‌ చేయడంలో పోలీసులు ప్రదర్శిస్తున్న అలసత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇది చాలా సీరియస్‌ అంశమని వ్యాఖ్యానించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెద్ద సంఖ్యలో క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ.. ఒత్తిడికి తలొగ్గి వారిని పోలీసులు అరెస్ట్‌ చేయడం లేదని జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. పెండింగ్‌ కేసుల విచారణకు వీడియో కాన్ఫెరెన్స్‌ సదుపాయం కల్పించాలని పలు హైకోర్టులు కోరుతున్నాయని తెలిపింది.

ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసుల పూర్తి వివరాలను తాజాగా తమకు అందించాలని, అలాగే, కేసుల త్వరిత విచారణకు తమ రాష్ట్రంలో ఎన్ని వీడియో కాన్ఫెరెన్స్‌ సదుపాయాలు అవసరమవుతాయో తెలపాలని హైకోర్టులను జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌ సభ్యులుగా ఉన్న ధర్మాసనం ఆదేశించింది. కేసుల విచారణ త్వరితగతిన సాగేందుకు కింది కోర్టులపై హైకోర్టుల కఠిన పర్యవేక్షణ అవసరమని ఈ విచారణలో అమికస్‌ క్యూరీగా నియమితుడైన సీనియర్‌ న్యాయవాది విజయ్‌ హన్సారియా సూచించారు

Tags :
|

Advertisement