Advertisement

  • కరోనా నియంత్రణలో కేంద్రం రాష్ట్రాలు కలిసి పనిచేయాలి ..సుప్రీమ్ కోర్ట్

కరోనా నియంత్రణలో కేంద్రం రాష్ట్రాలు కలిసి పనిచేయాలి ..సుప్రీమ్ కోర్ట్

By: Sankar Fri, 18 Dec 2020 6:56 PM

కరోనా నియంత్రణలో కేంద్రం రాష్ట్రాలు కలిసి పనిచేయాలి ..సుప్రీమ్ కోర్ట్


కరోనా మహమ్మారి తీవ్రత తగ్గినప్పటికీ జాగ్రత్తగా ఉండాలని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి వ్యాప్తిపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది.

జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం కరోనా మహమ్మారి వ్యాప్తిపై దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపింది. కేంద్రం మార్గదర్శకాలు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లు సరిగ్గా అమలు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో కేంద్రంతో రాష్ట్రాలు కలిసి పనిచేయాలి ...

కరోనాను అరికట్టేందుకు లాక్ డౌన్, కర్ఫ్యూ వంటివి విధించాలంటే ఆ నిర్ణయంపై ప్రభుత్వం ముందుగానే ప్రకటన చేయాలనీ, ప్రజలు దానికి అనుగుణంగా సిద్ధమౌతారని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రతి రాష్ట్రం అప్రమత్తంగా ఉండాలని, ప్రజల ఆరోగ్యం, రక్షణకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని సుప్రీంకోర్టు పేర్కొన్నది.

Tags :
|
|

Advertisement