Advertisement

  • చట్టసభ్యుడు దోషిగా తేలితే ఓటు చెల్లుబాటు అవుతుందా...సుప్రీంకోర్టు సంచలన తీర్పు

చట్టసభ్యుడు దోషిగా తేలితే ఓటు చెల్లుబాటు అవుతుందా...సుప్రీంకోర్టు సంచలన తీర్పు

By: chandrasekar Sat, 19 Dec 2020 6:16 PM

చట్టసభ్యుడు దోషిగా తేలితే ఓటు చెల్లుబాటు అవుతుందా...సుప్రీంకోర్టు సంచలన తీర్పు


నేరం రుజువై దోషిగా తేలిన ప్రజాప్రతినిధి ఓటు చెల్లుబాటుపై తీర్పు వెలువడే సమయం ముందు వరకూ ఆ వ్యక్తి ఓటు చెల్లుబాటు అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మార్చి 23,2018న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో జార్ఖండ్‌ ముక్తి మోర్చా ఎమ్మెల్యే అమిత్‌కుమార్‌ మహతో ఉదయం 9.15 నిమిషాలకు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఓ కేసులో న్యాయస్థానం ఆయన్ను దోషిగా తేల్చింది.

అమిత్ ఓటు లెక్కింపులో దీనిని పరిగణనలోకి తీసుకున్నారు. దానివల్ల బీజేపీ రాజ్యసభ అభ్యర్థి ప్రదీప్‌కుమార్‌ సోంతాలియా ఓటమి పొందారు. దీన్నిసవాల్ చేస్తూ ప్రదీప్‌కుమార్‌ హైకోర్టులో కేసు నమోదు చేసారు. ఆయన ఎన్నికల పిటిషన్‌ను ఝార్ఖండ్ హైకోర్టు ఈ ఏడాది జనవరి 17న కొట్టేసింది. అందువల్ల సుప్రీంకోర్టుకు వెళ్లారు. ప్రధాన న్యాయమూర్తి 32 పేజీల తీర్పును వెలువరించారు.

Tags :

Advertisement