Advertisement

  • భక్తులు లేకుండా రథయాత్రను నిర్వహించుకోండి ..సుప్రీమ్ కోర్ట్

భక్తులు లేకుండా రథయాత్రను నిర్వహించుకోండి ..సుప్రీమ్ కోర్ట్

By: Sankar Mon, 22 June 2020 2:24 PM

భక్తులు లేకుండా రథయాత్రను నిర్వహించుకోండి ..సుప్రీమ్ కోర్ట్



ఓడిశాలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం పూరి ..అక్కడ కొలువై వెలిసిన దేవుడు జగన్నాథుడు ..ప్రతి సంవత్సరం ఆ జగనాథుడిని , అతడి తోబుట్టువులు అయిన బలరాముడు , సుభద్రాలను అంగరంగ వైభవంగా యాత్ర నిర్వహిస్తూ ఊరేగిస్తారు..ఈ అత్యంత శోభాయమానమైన ఈ పూరి జగన్నాథుడి యాత్రను చూసేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారు ..ప్రతి సంవత్సరం అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించే ఈ ఉత్సవం ఈ సారి కరోనా కారణంగా జరుగుతుందా లేదా అని భక్తులు ఉత్కంఠగా ఎదురు చూసారు ..

అయితే భక్తులు లేకుండా రథయాత్ర నిర్వహించాలని, రథయాత్రను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. జూన్‌ 18న ఇచ్చిన తీర్పును సవరించి ఈ మేరకు సోమవారం నిర్ణయం తీసుకుంది. కాగా, కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో యాత్ర నిర్వహణకు సుప్రీంకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ రథయాత్ర నిర్వహిస్తే ఆ దేవుడే మనల్ని క్షమించడు అంటూ గతంలో ధర్మాసనం వ్యాఖ్యానించింది. భౌతిక దూరం నిబంధనకు ప్రాధాన్యం కల్పించేందుకు యాత్ర నిర్వహణలో యాంత్రిక శక్తి, ఏనుగుల వినియోగం పట్ల హైకోర్టు మొగ్గు చూపడం ఆలయ సంప్రదాయ, చట్ట వ్యతిరేకమని పిటిషనర్‌ చేసిన వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం జూన్‌ 18న పూరీజగన్నాథ రథయాత్రపై స్టే విధించింది.

అయితే యాత్ర నిర్వహణపై సానుకూల పరిస్థితులను లోతుగా సమీక్షించకుండా సుప్రీం తీర్పు వెల్లడించిందని కొన్ని వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఈ నేపథ్యంలో తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ ఆ వర్గాలు 17 మోడిఫికేషన్లతో పిటిషన్లు దాఖలు చేశాయి. ఆయా పిటిషన్లు పరిశీలించిన ధర్మాసనం ఈ సోమవారం విచారణ జరిపి తీర్పు ఇచ్చింది.

Tags :

Advertisement