Advertisement

  • బ్యాంకులోన్ మారటోరియం పొడిగింపుపై రుణగ్రహీతలకు సుప్రీంకోర్టు ఉపశమనం

బ్యాంకులోన్ మారటోరియం పొడిగింపుపై రుణగ్రహీతలకు సుప్రీంకోర్టు ఉపశమనం

By: chandrasekar Fri, 11 Sept 2020 5:43 PM

బ్యాంకులోన్ మారటోరియం పొడిగింపుపై  రుణగ్రహీతలకు సుప్రీంకోర్టు ఉపశమనం


బ్యాంకులోన్ మారటోరియం పొడిగింపుపై రుణగ్రహీతలకు సుప్రీంకోర్టు కాస్త ఉపశమనం కల్పించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఏ రుణ గ్రహీతను కూడా నిరర్థక ఆస్తులుగా ప్రకటించకూడదని స్పష్టం చేసింది. లోన్ రీపేమెంట్ మారటోరియంను సెప్టెంబర్ 28 వరకు పొడిగించింది. ఆ రకంగా గతంలో ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను పొడిగించింది. దీనిపై సమగ్రంగా చర్చించుకుని అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐలకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ రుణ విషయంపై విచారణను ఈనెల 28వ తేదీకి వాయిదా వేసింది. మళ్లీవాయిదా ఉండదని, ఇదే ఆఖరి వాయిదా అని స్పష్టం చేసింది. దీనిపై ప్రభుత్వం స్పందించాల్సి వుంది. ప్రభుత్వం ఏమి చేయాలనుకుంటుందో, ఆర్బీఐ ఏం చేస్తుదో స్పష్టమైన వైఖరి చెబుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. కరోనా నేపథ్యంలో రుణాలపై మారటోరియం పొడిగింపు, వడ్డీ మాఫీ అంశంపై దాఖలైన పిటిషన్లపై జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.

కరోనా కారణంగా చాలామంది తమ ఆదాయాన్ని కోల్పోవడంతో మారటోరియం సౌలభ్యాన్ని వినియోగించుకున్న రుణగ్రహీతల నుంచి ఆ నియమిత సమయానికి వడ్డీల మీద కూడా వడ్డీలు వసూలు చేస్తున్నారని పిటిషనర్ల తరఫున న్యాయవాది రాజీవ్ దత్తా సుప్రీంకోర్టుకు సూచించారు. ఇలా చక్రవడ్డీలు వసూలు చేస్తే ఇక మారటోరియం వల్ల లాభం ఏముందని ప్రశ్నించారు. కొన్ని లక్షల మంది ప్రజలు అనారోగ్యం కారణంగా ఆస్పత్రులు పాలయ్యారు. వారు చికిత్స పొందుతున్నారన్నారు. ఇలాంటి సమయంలో చక్రవడ్డీలు కట్టమంటే ఎలా కడతారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

దేశంలో ఆర్ధిక స్థితి మరింత క్షీణించడంతో చాలా మంది నిరుద్యోగులయ్యారు మరియు చిన్న చిన్న పారిశ్రామాలు మూతపడ్డాయి. అలాగే, కరోనా లాక్ డౌన్ కారణంగా కొందరి ఉద్యోగాలు పోయాయని, మరికొందరికి వేతనాలు కట్ అవుతున్నాయని చెప్పారు. పరిశ్రమలతో పాటు వ్యక్తిగత రుణగ్రహీతలకూ ఉపశమనం కల్పించాలని మరో న్యాయవాది విశాల్ తివారీ అన్నారు. దుపరి ఆదేశాలు ఇచ్చే వరకు సిబిల్​ స్కోర్​ మార్పులు, బలవంతపు చర్యలు తీసుకోకూడదని అభ్యర్థించారు. బ్యాంకులేమో మారటోరియం పొడిగించడంపై సుముఖంగా లేనట్లు తెలుస్తుంది.

Tags :

Advertisement