Advertisement

  • సుప్రీం కోర్టులోనూ జగన్ సర్కార్ కు చుక్కెదురు

సుప్రీం కోర్టులోనూ జగన్ సర్కార్ కు చుక్కెదురు

By: Sankar Wed, 10 June 2020 4:02 PM

సుప్రీం కోర్టులోనూ జగన్ సర్కార్ కు చుక్కెదురు

ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురయ్యింది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహారంపై సుప్రీం కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. రమేశ్ కుమార్‌ను కమిషనర్‌గా కొనసాగించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.

ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ బోబ్డే, న్యాయమూర్తులు జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హృషీకేశ్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా జగన్ సర్కార్‌పై ధర్మాసనం తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగ సంస్థలతో ఆటలు తగదని హెచ్చరించింది. ప్రతివాదులకు రెండు వారాల్లో నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.


Tags :
|
|

Advertisement