Advertisement

  • నెలరోజుల్లోగా ఆ టన్నెల్స్ ను తీసేయాలి...కేంద్రాన్ని ఆదేశించిన సుప్రీమ్ కోర్ట్

నెలరోజుల్లోగా ఆ టన్నెల్స్ ను తీసేయాలి...కేంద్రాన్ని ఆదేశించిన సుప్రీమ్ కోర్ట్

By: Sankar Fri, 06 Nov 2020 06:25 AM

నెలరోజుల్లోగా ఆ టన్నెల్స్ ను తీసేయాలి...కేంద్రాన్ని ఆదేశించిన సుప్రీమ్ కోర్ట్


మనుషులపై రసాయనాలు చల్లే డిస్‌ఇన్‌ఫెక్షన్‌ టన్నెల్స్‌ని నిషేధిస్తూ ఒక నెల రోజుల్లోగా ఆదేశాలు జారీచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. మనుషులు కృత్రిమ అతినీలలోహిత కిరణాలకు గురికాకుండా మార్గదర్శకాలు విడుదల చేయాలని సూచించింది.

డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌–2005 లాంటి చట్టాల ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలంది. మనుషులను అతి నీలలోహిత కిరణాలకు గురిచేయడం, డిస్‌ఇన్‌ఫెక్షన్‌ టన్నెల్స్‌ని వాడటం లాంటి చర్యలను నిషేధించాలని కోరుతూ గుర్‌ సిమ్రాన్‌ నరూలా దాఖలు చేసిన పిటిషన్‌ని కోర్టు విచారించింది.

ఇప్పటికే మనుషులపై క్రిమిసంహారాలను చల్లరాదని, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ మార్గదర్శకాలను విడుదల చేసినట్టు కోర్టు తన తీర్పులో పేర్కొంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నెలరోజుల్లోగా ఈ ప్రక్రియని ముగించాలని కేంద్రానికి కోర్టు సూచించింది.

Tags :
|
|

Advertisement