Advertisement

  • ఈఎంఐ కట్టేవారికి శుభవార్త చెప్పిన సుప్రీం కోర్ట్

ఈఎంఐ కట్టేవారికి శుభవార్త చెప్పిన సుప్రీం కోర్ట్

By: Sankar Fri, 04 Sept 2020 4:25 PM

ఈఎంఐ కట్టేవారికి శుభవార్త చెప్పిన సుప్రీం కోర్ట్


బ్యాంకుల నుండి లోన్లు తీసుకుని ఈఎంఐ కట్టేవారికి సుప్రీంకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. మరో రెండు నెలల వరకు బ్యాంక్ అకౌంట్లను మొండి బకాయిలుగా ప్రకటించవద్దని బ్యాంకులకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కరోనా విజృంభణతో జనజీవనం అస్తవ్యస్తమైంది.

వైరస్ ఉదృతి నేపథ్యంలో దేశంలో లాక్ డౌన్ విధించారు. దాంతో కంపెనీలు నష్టాల బాట పట్టడటంతో చాలామంది ప్రైవేట్ ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. వ్యాపారస్తులు సైతం తీవ్రంగా నష్టపోయారు. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో లోన్లు తీసుకున్నవారు ఈఎంఐ లు కట్టలేని పరిస్థితి ఏర్పడింది. రుణాలు తీసుకున్న వారికోసం ఈఎంఐ మారటోరియం సదుపాయాన్నికేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆగస్ట్ నెల చివరితోనే ఈ ప్రయోజనం గడువు తీరిపోయింది.

కాగా ఇప్పటికీ ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నందున సుప్రీం మరో రెండు నెలలపాటు బ్యాంక్ అకౌంట్లను మొండి బకాయిలుగా ప్రకటించవద్దని బ్యాంకులకు ఆదేశించింది. ఆగస్టు 31 వరకు డిఫాట్ల్ కానీ బ్యాంక్ అకౌంట్లను మరో రెండు నెలల వరకు మొండి బకాయిలుగా ప్రకటించవద్దని సుప్రీం ఆదేశించింది. ఇదిలా ఉండగా ఈ కేసుపై సెప్టెంబర్ 10న మరోసారి వాదనలు జరగనున్నాయి.

Tags :
|
|

Advertisement