Advertisement

  • ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్లు .. పిటిషన్ కొట్టివేసిన సుప్రీమ్ కోర్ట్

ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్లు .. పిటిషన్ కొట్టివేసిన సుప్రీమ్ కోర్ట్

By: Sankar Mon, 26 Oct 2020 2:33 PM

ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్లు .. పిటిషన్ కొట్టివేసిన సుప్రీమ్ కోర్ట్


తమిళనాడులోని మెడికల్ కాలేజీల్లో ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని వేసిన పిటిషన్‌ విచారణను స్వీకరించేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.

ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం సహా డీఎంకే, అన్నాడీఎంకే, సీపీఎం రాజకీయ పార్టీలు పిటిషన్ దాఖలు చేశాయి. కాగా, 2006 చట్టం కింద ఇప్పటికే ఓబీసీలకు గరిష్టంగా 27శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. అయితే వీటిని సరిగ్గా అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, ఫలితంగా గత మూడేళ్ళలో 10 వేల సీట్లను ఇతరులు కొల్లగొట్టారని పిటిషన్‌దారులు ఆరోపిస్తున్నారు.

‘తమిళనాడులో వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం అన్ని రాజకీయ పార్టీలూ కలిసి వచ్చాయి. ఇది ఒక అసాధరణ విషయం. కానీ, రిజర్వేషన్ ప్రాథమిక హక్కు కాదనే నిర్ణయానికే సుప్రీంకోర్టు కట్టుబడి ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 పౌరులకు సమానత్వ హక్కును కల్పిస్తోంది. రిజర్వే,న్లను అందుకు మినహాయింపుగా సూచించింది’’ అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. అయితే ఈ విషయంలో రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించే స్వేచ్ఛ పిటిషనర్లకు ఉందని సుప్రీం కోర్టు తెలిపింది.

Tags :

Advertisement