Advertisement

  • మోడీ సర్కారుకు సుప్రీం కోర్టు భారీ షాక్ ఇచ్చింది...!

మోడీ సర్కారుకు సుప్రీం కోర్టు భారీ షాక్ ఇచ్చింది...!

By: Anji Thu, 17 Dec 2020 3:51 PM

మోడీ సర్కారుకు సుప్రీం కోర్టు భారీ షాక్ ఇచ్చింది...!

కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాల అమలును ఆపాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చెప్పింది.

ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిర్వహిస్తున్న ఉద్యమం, నిరసనలపై దాఖలైన పిటిషన్లపై గురువారం అత్యున్నత న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది.

ఈ పిటిషన్లపై వెకేషన్ బెంచ్ విచారణ జరుపుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే చెప్పారు. రైతు సంఘాలు కోర్టుకు హాజరు కాకపోవడంతో ఎటువంటి ఆదేశాలను జారీ చేయలేదు.
మోదీ సర్కార్‌ను ఉద్దేశించి జస్టిస్ బాబ్డే మాట్లాడుతూ, వివాదాస్పద వ్యవసాయ చట్టాల అమలును నిలిపేయడానికి అవకాశాలను పరిశీలించాలని చెప్పారు. ఇందుకు ప్రభుత్వం స్పందిస్తూ, అది జరిగే అవకాశం లేదని పేర్కొంది.

దీనిపై జస్టిస్ బాబ్డే స్పందిస్తూ, ముందుగానే కాదనవద్దని, దయచేసి సలహాను పరిశీలించాలని చెప్పారు. ఈలోగా రైతు సంఘాలకు నోటీసులు జారీ చేయాలని అన్నారు.

తదుపరి విచారణ వింటర్ వెకేషన్‌లో జరుగుతుందని తెలిపారు. వెకేషన్ బెంచ్‌ని ఆశ్రయించేందుకు పిటిషనర్లకు అవకాశం కల్పించారు.

మరోవైపు ఢిల్లీ సరిహద్దుల్లో మూడు వారాల నుంచి రైతలు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర వ్యవసాయ చట్టాల్ని వ్యతిరేకిస్తూ అన్నదాతలు చేస్తున్న ఆందోళన రోజురోజుకు ఉదృతం అవుతోంది. రైతుసంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు జరిపినా అవి ఫలించలేదు.

Tags :

Advertisement