Advertisement

  • ఆత్మనిర్భర్ లో భాగంగా తొలి‌సారి తయారు చేసిన మందుగుండు బీఎస్ఎఫ్ కు సరఫరా

ఆత్మనిర్భర్ లో భాగంగా తొలి‌సారి తయారు చేసిన మందుగుండు బీఎస్ఎఫ్ కు సరఫరా

By: chandrasekar Thu, 13 Aug 2020 5:51 PM

ఆత్మనిర్భర్ లో భాగంగా తొలి‌సారి తయారు చేసిన మందుగుండు బీఎస్ఎఫ్ కు సరఫరా


ఆత్మనిర్భర్ లో భాగంగా తొలి‌సారి తయారు చేసిన మందుగుండును బీఎస్ఎఫ్ కు సరఫరా చేయబడింది. ఫూణే ఆయుధ ఫ్యాక్టరీ నుంచి తొలి మందుగుండు సరుకు రవాణా ద్వారా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు అందించారు. మహారాష్ట్ర పూణేలోని ఖాడ్కి ఆయుధ ఉత్పత్తి కర్మాగారంలో తొలి‌సారి తయారు చేసిన మందుగుండును బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)కు పంపారు. 40 ఎంఎం యూబీజీఎల్ మందుగుండు సరుకుతో అక్కడి నుంచి బయలు దేరిన ప్రత్యేక వాహనానికి అధికారులు మంగళవారం పచ్చజెండా ఊపారు.

మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తాయారు చేయబడ్డ ఈ మందుగుండు సరిహద్దులోని బీఎస్ఎఫ్ జవాన్లు వినియోగించే 5.56 ఎంఎం ఇన్సాస్ రైఫిల్స్‌లో ఈ బులెట్లను వాడతారని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఆర్మీ అవసరాలను తీర్చే రక్షణ పరికరాలు, ఆయుధాలను స్వదేశంలోనే తయారు చేస్తున్నట్లు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఇటీవల పేర్కొన్నారు. ఇందువల్ల దేశంలో ఉద్యోగ అవకాశాలు పెరగడంతో బాటు తక్కువ ఖర్చుతో ఆయుధాలను మనమే తయారు చేసుకోవచ్చు.

Tags :
|
|

Advertisement