Advertisement

  • అది ఫేక్ లెటర్ ..కాని అందులో ఉన్నదీ ఒకటి మాత్రం నిజం...సూపర్ స్టార్ రజనీకాంత్

అది ఫేక్ లెటర్ ..కాని అందులో ఉన్నదీ ఒకటి మాత్రం నిజం...సూపర్ స్టార్ రజనీకాంత్

By: Sankar Thu, 29 Oct 2020 6:13 PM

అది ఫేక్ లెటర్ ..కాని అందులో ఉన్నదీ ఒకటి మాత్రం నిజం...సూపర్ స్టార్ రజనీకాంత్


తన ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడం వల్ల తాను రాజకీయాల్లోకి రాకపోవచ్చని తెలియజేస్తూ సూపర్ స్టార్ రజినీకాంత్ స్వయంగా రాసిన లేఖ ఒకటి బుధవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ లేఖ నిన్న పెద్ద దుమారమే రేపింది. దీనిపై రజినీ ఫ్యాన్స్‌తో పాటు విమర్శకులు తీవ్ర స్థాయిలో చర్చించుకున్నారు. అయితే, ఈ లేఖపై గురువారం రజినీకాంత్ స్వయంగా స్పందించారు. ఈ లేఖలో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఆయన ఒక ప్రకటన ఉంచారు.

తాను రాజకీయాల్లోకి రావడం లేదని స్పష్టం చేస్తూ విడుదల చేసిన ఆ లేఖ ఫేక్ అయినప్పటికీ ఆ లేఖలో పేర్కొన్నట్టు తన ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడం మాత్రం నిజమేనని రజినీ వెల్లడించారు. ‘‘నేను ప్రకటించినట్టు ఒక లేఖ సోషల్ మీడియాలో, ప్రెస్‌లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఇది నా ప్రకటన కాదని ప్రతి ఒక్కరికీ తెలియజేస్తున్నాను.

అయితే, నా ఆరోగ్యం గురించి.. డాక్టర్లు నాకు ఇచ్చిన సలహాల గురించి పేర్కొన్న విషయాలన్నీ నిజమే. నా రాజకీయ ప్రవేశం గురించి ప్రజలకు నేనే స్వయంగా చెబుతాను. నా రజినీ మక్కల్ మండ్రమ్ సభ్యులతో చర్చించిన తరవాత సరైన సమయంలో ఈ ప్రకటన చేస్తాను’’ అని రజినీకాంత్ స్పష్టం చేశారు.

Tags :
|

Advertisement