Advertisement

  • రజిని ఆరోగ్యం నిలకడగా ఉంది ..అభిమానులు ఆసుపత్రి వద్దకు రావొద్దు ..అపోలో వైద్యులు

రజిని ఆరోగ్యం నిలకడగా ఉంది ..అభిమానులు ఆసుపత్రి వద్దకు రావొద్దు ..అపోలో వైద్యులు

By: Sankar Fri, 25 Dec 2020 7:10 PM

రజిని ఆరోగ్యం నిలకడగా ఉంది ..అభిమానులు ఆసుపత్రి వద్దకు రావొద్దు ..అపోలో వైద్యులు


అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన సౌత్‌ సూపర్ స్టార్‌‌ రజనీకాంత్‌ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. శుక్రవారం రాత్రి కూడా ఆస్పత్రిలోనే ఉండనున్నారు.

ఇంటర్నేషనల్‌ షూట్‌లోని ప్రత్యేక రూమ్‌లో రజనీకాంత్‌కు వైద్య సేవలు అందిస్తున్నారు. కేవలం ఒక్క డాక్టర్‌ పర్యవేక్షణలో సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు. డాక్టర్ కే.హరిబాబు నేతృత్వంలోని వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యం కుదటపడితే శనివారం ఉదయం డిశ్చార్‌ చేస్తామని వైద్యులు తెలిపారు.

రక్తపోటును తగ్గించేందుకు మందులు వాడుతున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు అపోలో వైద్యులు హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నందున అభిమానులు ఎవరూ ఆస్పత్రి వద్దకు రావద్దని వైద్యులు కోరారు.

Tags :
|

Advertisement