Advertisement

ప్రిన్స్ మహేష్ తొలి చిత్రానికి నేటితో 21 ఏళ్ళు

By: Sankar Thu, 30 July 2020 4:28 PM

ప్రిన్స్ మహేష్ తొలి చిత్రానికి నేటితో 21 ఏళ్ళు



సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా నటించిన మొదటి చిత్రం ‘రాజకుమారుడు’ విడుదలై నేటికి 21 వసంతలు పూర్తి చేసుకుంటోంది. 1999 జూలై 30న విడుదలైన ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అవ్వడమే కాకుండా మహేష్‌కు మంచి పేరును తెచ్చిపెట్టింది.

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాను వైజయంతి బ్యానర్‌లో అశ్వినీదత్‌ నిర్మించారు. బాలీవుడ్ భామ ప్రీతి జింతా హీరోయిన్‌ నటించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషించగా, సూపర్ స్టార్ కృష్ణ క్యామియో రోల్ చేయడం విశేషం. కాగా హీరోగా 21 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న మహేష్ ఇప్పటి వరకు 26 సినిమాలు చేశాడు.

ఈ సందర్భంగా ప్రిన్స్‌ మహేష్‌బాబు ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. తనకు తొలి చిత్రం రాజకుమారుడు హిట్‌ ఇచ్చినందుకు రాఘవేంద్రరావు, చిత్ర యూనిట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా అనుభవంతో నటనలో తనెంతో నేర్చుకున్నట్లు వెల్లడించారు. రాఘవేంద్ర రావు, చిత్ర యూనిట్‌తో కలిసిన పనిచేసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.

ఈ సినిమా ద్వారా ఎన్నో మధుర జ్ఞాపకాలు అందించిన అశ్వినీదత్‌కు చిత్ర బృందానికి రాఘవేంద్రరావు శుభాకాంక్షలు తెలిపారు. మహేష్‌ బాబు తన కెరీర్‌లో ఇంకెన్నో విజయాలు సాధించాలని ఆశీర్వదించారు. ఈ మేరకు సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోలను ట్విటర్‌లో పోస్టు చేశారు..

Tags :

Advertisement