Advertisement

  • ఆస్ట్రేలియా టూర్ లో సన్‌రైజర్స్ పేసర్‌ నటరాజన్ కు చోటు

ఆస్ట్రేలియా టూర్ లో సన్‌రైజర్స్ పేసర్‌ నటరాజన్ కు చోటు

By: chandrasekar Tue, 10 Nov 2020 10:22 AM

ఆస్ట్రేలియా టూర్ లో సన్‌రైజర్స్ పేసర్‌ నటరాజన్ కు చోటు


ఆస్ట్రేలియా టూర్ లో సన్‌రైజర్స్ పేసర్‌ నటరాజన్ కు చోటు దక్కింది. తమిళనాడుకు చెందిన ఈ ఎడమ చేతివాటం పేసర్ మంచి యార్కర్ బంతులను విసరగలడు. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న భారత జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేసర్‌ టీ నటరాజన్‌ను ఆ జట్టు కెప్టెన్ మరియు ఆసీస్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అభినందించాడు.

ఈ నవంబరులో ఆసీస్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఎంపికైన మిస్టరీ స్పిన్నర్‌ వరున్‌ చక్రవర్తి స్థానంలో నటరాజన్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. భుజం గాయం కారణంగా వరుణ్‌ టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. ఐపీఎల్‌-13 క్వాలిఫయర్‌-2లో ఢిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో పోరాడి ఓడిన సన్‌రైజర్స్‌ ప్రదర్శనపై వార్నర్‌ స్పందించాడు.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు సభ్యుల ఆటతీరుపై గర్వపడుతున్నానని, వచ్చే ఏడాది ఫైనల్‌ చేరుతామని ఆశిస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్‌ చేశాడు. ఈ సందర్భంగా కంగ్రాచ్యులేషన్స్ నట్టూ ఆస్ట్రేలియాలో మళ్లీ కలుద్దాం అంటూ వార్నర్‌ తెలిపాడు. ఫీల్డింగ్ మరియు బాటింగ్ వైఫల్యం వల్ల హైదరాబాద్ ఫైనల్ కు చేరుకోలేక పోయారు.

Tags :
|
|

Advertisement