Advertisement

  • తప్పక గెలవాల్సిన పోరులో పటిష్ట జట్టు ముంబై ఇండియన్స్ తో తలపడనున్న సన్ రైజర్స్ హైదరాబాద్

తప్పక గెలవాల్సిన పోరులో పటిష్ట జట్టు ముంబై ఇండియన్స్ తో తలపడనున్న సన్ రైజర్స్ హైదరాబాద్

By: Sankar Mon, 02 Nov 2020 1:22 PM

తప్పక గెలవాల్సిన పోరులో పటిష్ట జట్టు ముంబై ఇండియన్స్ తో తలపడనున్న సన్ రైజర్స్ హైదరాబాద్


రేపు డిఫెండింగ్ ఛాంపియన్స్ , ప్రస్తుత పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ తో ప్లే ఆఫ్ రేస్ లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన సన్ రైజర్స్ హైదరాబాద్ పోటీ పడనుంది.. ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓడితే... ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా ప్లేఆఫ్ చేరతాయి.

ఆరెంజ్ ఆర్మీ ముంబై ఇండియన్స్‌పై గెలిస్తే.. హైదరాబాద్ ఫ్రాంచైజీ ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తుంది. ఢిల్లీ/బెంగళూరు, కోల్‌కతా, సన్‌రైజర్స్ జట్ల ఖాతాల్లో 14 పాయింట్లు ఉంటాయి. కానీ మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్న ఆరెంజ్ ఆర్మీ.. పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంటుంది. అదే జరిగితే.. నేటి మ్యాచ్‌లో ఓడిన జట్టు లేదా కోల్‌కతా ప్లేఆఫ్ చేరకుండానే ఇంటి ముఖం పడతాయి.

ఇతర జట్ల ప్లేఆఫ్ అవకాశాలను సన్‌రైజర్స్ ప్రభావితం చేయనుండగా.. ఆరెంజ్ ఆర్మీ జస్ట్ గెలిస్తే చాలు తదుపరి దశకు చేరడం ఖాయం. ఈ సీజన్లో సన్‌రైజర్స్‌ను గాయాలు వేధించాయి. మిచెల్ మార్ష్ తొలి మ్యాచ్‌లోనే టోర్నీ నుంచి నిష్క్రమించగా.. కొద్ది రోజుల వ్యవధిలోనే భువీ కూడా గాయం కారణంగా లీగ్‌కు దూరమయ్యాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన విజయ్ శంకర్ కూడా మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు.

Tags :
|

Advertisement