Advertisement

  • CSK పై విజయంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకిన సన్‌రైజర్స్ హైదరాబాద్

CSK పై విజయంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకిన సన్‌రైజర్స్ హైదరాబాద్

By: chandrasekar Sat, 03 Oct 2020 12:37 PM

CSK పై విజయంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకిన సన్‌రైజర్స్ హైదరాబాద్


CSK పై శుక్రవారం విజయంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎగబాకింది. ఐపీఎల్ 2020లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలిసారి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయానికి ముందు ఏడో ప్లేస్‌లో ఉన్న హైదరాబాద్ ధోనీ సేనపై విజయంతో నాలుగు పాయింట్లతో 4వ స్థానానికి చేరుకుంది. ఇక నాలుగు మ్యాచ్‌ల్లో ఒకే విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ చివరి స్థానంలో కొనసాగుతోంది. 4 మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించిన ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా 3 మ్యాచ్‌ల్లో రెండేసి విజయాలు అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ ఐదో స్థానంలోను బెంగళూరు ఆరో స్థానంలోను పంజాబ్ ఏడో స్థానంలో నిలిచాయి.

నాలుగు జట్లు ఈ రోజు పోటీలో పాల్గొననుంది. ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు బెంగళూరు, రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుండగా రాత్రి 7.30 గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా మధ్య మ్యాచ్ మొదలు కానుంది. బెంగళూరు, రాజస్థాన్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంటుంది. దీంతో సన్‌రైజర్స్ టాప్-4 దిగువకు పడిపోతుంది. 4 మ్యాచ్‌ల్లో 61.50 యావరేజ్‌తో 216 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్ ఆరెంజ్ క్యాప్‌ను దక్కించుకోగా మహ్మద్ షమీ 8 వికెట్లతో పర్పుల్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. ఢిల్లీ, కోల్‌కతా మ్యాచ్‌లో రబాడ మరో వికెట్ తీస్తే పర్పుల్ క్యాప్ అతణ్ని వరిస్తుంది. ఈ రోజునుండి రెండు మ్యాచ్లు జరగనుండడంతో అభిమానులకు మరింత ఉత్సాహాన్ని కలిగించనుంది.

Tags :
|

Advertisement