Advertisement

  • సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఓటమికి కారణాలు చెప్పిన బ్రాడ్ హాగ్

సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఓటమికి కారణాలు చెప్పిన బ్రాడ్ హాగ్

By: Sankar Sun, 27 Sept 2020 2:54 PM

సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఓటమికి కారణాలు చెప్పిన బ్రాడ్ హాగ్


ఈ ఏడాది లేట్ గా మొదలయిన కూడా ఎప్పటిలాగే ఐపీయల్ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తుంది..ప్రతి మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్నాయి..అయితే ఈ టోర్నీ ఇప్పటిదాకా అత్యంత నిరాశ పరిచిన జట్టు ఏదయినా ఉందా అంటే అది డేవిడ్ వార్నర్ నాయకత్వంలోని హైదరాబాద్ జట్టు మాత్రమే.. 2012లో సన్‌రైజర్స్‌ ఐపీఎల్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి చూసకుంటే బ్యాట్సమెన్ల కంటే ఎక్కువ బౌలర్ల సత్తా మీద ఆదారపడే ఎక్కువ మ్యాచ్‌లను గెలిచేది.

అయితే కరోనా నేపథ్యంలో యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్‌ 13వ సీజన్‌లో మాత్రం సన్‌రైజర్స్‌ బౌలర్లకు అక్కడి పిచ్‌లు అంతగా అనుకూలించడం లేదని ఆసీస్‌ మాజీ స్పిన్నర్‌ బ్రాడ్ హాగ్ పేర్కొన్నాడు. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌ తర్వాత బ్రాడ్ హాగ్ తన యూట్యూబ్‌ చానెల్‌లో సన్‌రైజర్స్‌ ప్రదర్శనపై పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

నాకు తెలిసి సన్‌రైజర్స్‌ బౌలర్లు ఇంకా యూఏఈ పిచ్‌లకు అలవాటు పడలేదనిపిస్తుంది. ఇక్కడి పిచ్‌లు వారికి అనుకూలించడం లేదు. సాధారణంగా యూఏఈలో ఉన్న పిచ్‌లు స్వింగ్‌కు అనుకూలించడం తక్కువ.. పేస్‌ బౌలింగ్‌కు కూడా అంతంతమాత్రంగానే సహకరిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే స్వింగ్‌ బౌలర్‌ భూవీ యూఏఈ పిచ్‌లపై అంతగా ప్రభావం చూపలేకపోతున్నాడు. మిగతా సన్‌రైజర్స్‌ బౌలర్లు కూడా గుడ్‌ లెంగ్త్‌లో తమ బంతులను విసరలేకపోతున్నారు. ఇదే ఇప్పుడు వారికి పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్యను పూడ్చాలంటే సన్‌రైజర్స్‌ బౌలర్లు తమ ప్రాక్టీస్‌ను మరింత పెంచాలి. అని వెల్లడించాడు.

Tags :

Advertisement